ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచానికి చేరవేస్తున్నది.అయితే సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి.
అయితే కొన్ని వీడియోలు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి.ఇలా నెటిజన్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.
ఇక అసలు విషయానికొస్తే మనం ఇప్పటి వరకు మనుషులు తన ప్రేయసికో, ప్రియుడికో ప్రపోజ్ చేయడం చూసి ఉంటాం.కాని జంతువులు ప్రపోజ్ చేయడం మనం ఎప్పుడూ చూసి ఉండము కదా.జంతువులు కూడా ప్రపోజ్ చేస్తాయా అని మీరు ఆశ్చర్య పోతున్నారు కదా.కాని మీరు ఈ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్ధమవుతుంది.
ఓ ఏనుగు తన ప్రేయసికి ప్రపోజ్ పూలు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్న వీడియో ఎంతో క్యూట్ గా ఉంది.ప్రేమ ఒక్క మనుషులలోనే ఉంటుంది, జంతువులలో ఉండదు అనే దానికి ఈ వీడియో ఖచ్చితమైన సమాధానం అని చెప్పవచ్చు.
అయితే ఈ వీడియోలో ఇంకా ఒక మగ ఏనుగు ఆడ ఏనుగుకు పుష్పగుచ్చాన్ని ఇస్తుంది.దీంతో ఆడ ఏనుగు కూడా ఆ పుష్ప గుచ్చాన్ని తీసుకొని ప్రేమను అంగీకరించినట్లుగా సంకేతాలిస్తుంది.
ఇక ఆ తరువాత ఒకరి తొండాలను ఒకరు మెలిపెట్టుకుంటాయి.ఇక ఈ ఏనుగుల ప్రపోజల్ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరిచిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.వీడియోను చూసేయండి మరి.