తెలుగు దేశం పార్టీలో చాలా చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా లోకేష్ విషయంలోనే ఇలాంటివి నిత్యం వినిపిస్తున్నాయి.
ఆయన రాజకీయ భవిష్యత్ కోసం కొన్ని సార్లు పార్టీ లైన్ కూడా దాటేందుకు రెడీ అవుతున్నారు అగ్రనేతలు.ఇది కొందరికి ఇబ్బంది కలిగిస్తోంది.
లోకేష్ విషయంలోనే అసంతృప్తిగా ఉంటున్న నేతల్లో అచ్చెన్నాయుడు కూడా మొదటి వరుసలోనే ఉన్నారు.నిజానికి ఆయన ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
కానీ ఆ మేరకు ఆయనకు ఎలాంటి అధికారాలు దక్కట్లేదు.కేవలం లోకేష్ మాత్రమే హైలెట్ అవుతున్నారు.
నిజానికి ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉంటే.లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ప్రతి పనికి అచ్చెన్నాయుడికి కచ్చితంగా వెళ్లేంత అధికారం ఉంటుంది.కానీ ఆయన్ను ఏ విషయంలోనూ ఇన్ వాల్వ్ కానివ్వట్లేదు చంద్రబాబు నాయుడు.
ఏపీలో ఎలాంటి ఘటన జరిగినా లోకేష్ మాత్రమే వెళ్తున్నారు.పరామర్శల దగ్గరి నుంచి పార్టీ పరమైన ప్రకటనల వరకు అచ్చెన్నాయుడిని అడగకుండానే ఆయన నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.
ఇక చంద్రబాబు కూడా ఈ విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే సరికి అచ్చెన్నాయుడు కూడా లోకేష్ కు అడ్డు రావట్లేదు.

మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశానికి కూడా లోకేష్ వెళ్లారు తప్ప అచ్చెన్నాయుడు వెళ్లలేదు.ఏపీలో వరుసగా జరుగుతున్న పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు వినిపించలేదు.అన్నింటికీ లోకేష్ వెళ్లి ప్రచారం చేశారు.కానీ ఎక్కడా పార్టీ పెద్దగా విజయం సాధించలేదు.దీంతో అచ్చెన్న గుర్రుగా ఉన్నారంట.ఇక ఇప్పుడు జరుగుతున్న కొన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అచ్చెన్న ప్రచారం చేయట్లేదు.
కేవలం లోకేష్ మాత్రమే తిరుగుతున్నారు.ఇంకా చెప్పాలంటే నెల్లూరు కార్పొరేషన్ ను అచ్చెన్నాయుడుకు అప్పగించారు తప్ప ఎక్కడా తిరగనివ్వట్లేదు.
అక్కడ టీడీపీ గెలుపుకు ఆశలు లేవు.అంటే ఓడిపోతే ఆయన్ను బాధ్యున్ని చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది.
.