ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా 'అనుభవించు రాజా' : రాజ్ తరుణ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.

 Anubhavinchu Raja Movie Can Be Watched By All The Family Members Says Hero Raj T-TeluguStop.com

లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.నవంబర్ 26న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను, రెండో పాట ‘నీ వల్లే రా’ను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు.

ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించనున్నారు.

సెక్యూరిటీ గార్డుల మీద తెర‌కెక్కిన మూడో పాట‌ను హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్ లో సెక్యూరిటీ గార్డుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.బతికే హాయిగా అంటూ సాగిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా.

దీపు ఆలపించారు.గోపీ సుందర్ అందించిన బాణీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మాట్లాడుతూ.‘ఈ పాటను సెక్యురిటీ గార్డ్‌లందరికీ అంకితం చేస్తున్నామ’ని అన్నారు.

Telugu Srinu Gavi, Raj Tharun, Securityguard, Tollywood, Watched-Movie

లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.‘ఎప్పుడూ ఎదుటోళ్లలో తప్పులు వెతికేటప్పుడు నువ్ కూడా ఓ మనిషివే అని గుర్తు పెట్టుకోవాలి.ఏ లోపం లేకపోతే మనం దేవుళ్లం అయిపోయే వాళ్లం కదా? మనకీ ఎమోషన్స్, కోపం ఉంటాయి.అది అర్థం చేసుకోవాలని చెప్పిన ఆ లైన్స్ నాకు బాగా నచ్చాయ్’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.‘ఈ పాటలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్‌లా నెక్ట్స్ లెవెల్‌లో కనిపించారు.అద్భుతంగా పాటను రాసినందుకు భాస్కర భట్ల గారికి థ్యాంక్స్.మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీసుందర్‌కు ధన్యవాదాలు.

సెక్యురిటీ పాత్రను రాజ్ తరుణ్ పోషించారు.చాలా మంది సెక్యురిటీ గార్డులను కలిసి వారి నుంచి ఎంతో తెలుసుకున్నాను.

సినిమా బాగా వచ్చింది.నవంబర్ 26న రాబోతోంద’ని అన్నారు.

Telugu Srinu Gavi, Raj Tharun, Securityguard, Tollywood, Watched-Movie

రాజ్‌ తరుణ్ మాట్లాడుతూ.‘మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.అలా నిల్చుంటారు.రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం.కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది.వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.

వారు ఎంత కష్టపడతారో తెలిసింది.వారందరికీ హ్యాట్సాఫ్.

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా.కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు’ అని అన్నారు.

సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నాగేష్ బానెల్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు :

రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా.

సాంకేతిక బృందం

రచయిత, దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి, నిర్మాత: సుప్రియ యార్లగడ్డ, బ్యానర్స్: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రెడ్డి కర్నాటి, సినిమాటోగ్రఫర్: నాగేష్ బానెల్, ఎడిటర్: చోటా కే ప్రసాద్, లిరిక్స్: భాస్కర భట్ల, ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్, కొరియోగ్రఫర్: విజయ్ బిన్నీ, ఫైట్ మాస్టర్: రియల్ సతీష్, క్యాస్టూమ్ డిజైనర్: రజినీ.పి, కో డైరెక్టర్: సంగమిత్ర గడ్డం, పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube