బైక్ స్టంట్ చేయాల‌నుకున్నాడు.. కానీ ఇలా జ‌రిగిందేంటి..

బైక్ అంటే యువ‌త‌కు ఎంత వ్యాహోహ‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.బైక్ మీద ర‌య్ మంటూ టాప్ గేర్లో దూసుకెళ్తుంటే ఆ మ‌జాయే వేరు.

 He Wanted To Do A Bike Stunt But This Is What Happened .bike Stunt, Viral Video-TeluguStop.com

ప్ర‌తి ఒక్క‌రూ బైక్ న‌డ‌పాల‌ని ఆశిస్తుంటారు.పెద్ద పెద్ద కార్లు ఉన్న వారు కూడా స్పోర్ట్స్ బైకుల‌ను న‌డిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

హీరోల ద‌గ్గ‌రి నుంచి సామాన్యుల దాకా అంద‌రూ ఇలా బైక్ మీద ర‌య్ మంటూ దూసుకెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.కానీ బైక్ న‌డిపేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది.

లేదంటే మాత్రం చివ‌ర‌కు ప్రాణాల‌కే ప్ర‌మాదం వాటిల్లుతుంది.

ఇదే విష‌యం ఎన్నోసార్లు నిరూపిత‌మ‌యింది.

చాలామంది ప్ర‌మాద‌క‌ర బైక్ స్టంట్లు చేయ‌డం మ‌నం చూస్తున్నాం.ఇలా బైక్ స్టంట్లు చేసి చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు.

ఎందుకంటే ఇది ప్రాణాల‌తో చెల‌గాటం ఆడేలా ఉంటుంది.ఇలాంటి వీడియోల‌కు సోష‌ల్‌ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంటుంది.

ఇలాంటి వీడియోలు చేసి చాలా మంది ఫేమ‌స్ కావాల‌ని కోరుకుంటున్నారు.ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి.

మ‌రికొన్ని మాత్రం విషాద‌క‌రంగా ఉంటాయి.అయితే ఇప్పుడు కూడా ఓ బైక్‌స్టంట్ వీడియో నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

ఇందులో చూస్తే ఓ వ్య‌క్తి ప్ర‌మాద‌క‌రంగా బైక్ స్టంట్ చేయాల‌ని అనుకుంటాడు.అనుకున్న‌ట్టు గానే ముందుగా త‌న బైక్‌ను గాలిలో లేపేందుకు ట్రై చేస్తుంటాడు.కానీ ఇక్క‌డే ఓ పెద్ద షాక్ త‌గులుతుంది.ఒక్క సారిగా ఆ బైక్ మధ్యలోకి విరిగిపోయి రెండు ముక్క‌లవుతుంది.దీంతో అత‌ను కింద పడిపోతాడు.ఇదంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట్లో వ‌దిలారు.

ఇంకేముంది నెటిజన్లు చూసి తెగ నవ్వుకుంటున్నారు.ఇలాంటివి అవ‌స‌ర‌మా బ్రో అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

అన‌వ‌స‌ర ప్ర‌యోగాల‌కు పోకుండా ఉండాలంటూ సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube