ఏపీలో ఏ పార్టీకి పట్టు ఉందంటే చెప్పే మాటలు రెండే రెండు.అందులో ఒకటి వైసీపీ అయితే మరొకటి మాత్రం టీడీపీ అనే చెప్పాలి.
కాగా ఇప్పుడు కొత్తగా మరో పార్టీ పుంజుకుంటోంది.నెమ్మదిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
అదే జనసేన పార్టీ.సినిమాల ద్వారా ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు.
గతంలో కంటే చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు.దీంతో అటు జనసైనికులు కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.
చాప కింద నీరులాగా జనసేన గ్రౌండ్ లెవల్ నుంచి విస్తరిస్తోంది.దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఏపీలో బలంగా ఉన్నటువంటి వైసీపీ, టీడీపీలు చేస్తున్న కొన్ని పొరపాట్లు జనసేనకు కలిసి వస్తున్నాయి.అంతిమంగా ఆ పార్టీ బలపడేందుకు సహకరిస్తున్నాయి.
విశాఖ జిల్లాలో ఇప్పటికే వరుసగా జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయి.మొన్నటికి మొన్న విశాఖ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయిన సంకు వెంకటేశ్వర్లు జనసేన కండువా కప్పుకున్నారు.
టీడీపీకి పెద్ద నేతగా ఉన్నటువంటి అప్పారావు జనసేనలోకి వచ్చారు.ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో ఉన్న బలమైన నేతలు జనసేనలోకి వస్తున్నారు.
ఇక అటు ఉత్తరాంధ్రలోకూడా వరుసగా వలసలు పెరుగుతున్నాయి.కాపు నేతలు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎక్కువగా టీడీపీ, వైసీపీలో మంచి గుర్తింపు ఉండి పదవులు రానటువంటి ద్వితీయ శ్రేణి నేతలను జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్ ఇంట్రెస్ట్ చూపుతున్నారంట.ఉత్తరాంధ్రా నుంచే ఈ వలసలు పెరగడాన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో జనసేన బలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇది టీడీపీకి పెద్ద మైనస్ అనే చెప్పాల్సి వస్తుంది.మరి పొత్తు చర్చల నేపథ్యంలో దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.