ఈ మధ్య కొందరు దుర్మార్గులు చేస్తున్న పనులు చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతున్నారు.నేరాలు చేయడంలో కొత్త దారులు వెతుకుతున్నారు.
ఇక సీక్రెట్ మహిళల వీడియోలు తీసేందుకు అయితే చాలా రకాల ఎత్తులు వేస్తున్నారు.ఏకంగా షాపింగ్ మాల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారంటే వీరి దుర్మార్గాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు కూడా ఓ క్రూరుడు ఇలాగే చేశాడు.నిజానికి ప్లంబర్ అంటే వచ్చి తన పని తాను చేసుకుని వెళ్తాడు కదా.
మన బాత్రూమ్ లోకి వెళ్లే అవకాశం అతనికి మాత్రమే ఉంటుంది.
ఎందుకంటే బాత్రూమ్ లలో ఏవైనా పైపులు పగిలిపోయినప్పుడు వారిని పిలుస్తాం.
ఈ సందు వారికి బాత్రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశంగా ఉంటుంది.అయితే దాన్నే ఆ ప్రబుద్ధుడు చెడు పనికి వినియోగించాడు.
బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఓ మహిళ తన ఇంట్లోని బాత్‌రూమ్ లో పైపు రిపేర్ కోసం 57 ఏళ్ల ప్లంబర్ ను పిలిపించింది.అయితే అతను పని చూసుకుని వెళ్లకుండా తన వెంట తెచ్చుకున్న సీసీ కెమెరాలను సీక్రెట్ గా ఆమెకు కనిపించకుండా ఆ బాత్రూమ్ లో పెట్టేశాడు.
వాటి సాంయతో ఆమె కదలికలన్నీ చాలా రోజులుగా రికార్డ్ చేస్తున్నాడు ఆ ప్రబుద్ధుడు.

అయితే ఓ రోజు ఆమెకు ఎందుకో అనుమానం వచ్చి క్లియర్ గా చూడగా ఆమెకు సీక్రెట్ కెమెరాలు కనిపించాయి.దీంతో షాక్ అయిన ఆమె వెంటనే దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్లంబర్‌ను అరెస్టు చేశారు.
కాగా విచారణలో అతను చెప్పిన విషయాలకు వారు షాక్ అయిపోయారు.అతను గతంలో కూడా ఇలాగే చాలామంది బాత్రూమ్ లలో సీక్రెట్ గా కెమెరాలు అమర్చినట్టు ఒప్పుకున్నాడు.
దీంతో వారి ఇండ్లను కనుక్కునే పనిలో పడ్డారు పోలీసులు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.