సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సమాజంలో జరిగే సంఘటనలను ఆధారంగా రాజకీయ నాయకులు జీవిత చరిత్రలను ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ నిత్యం వివాదాలకు కారణమవుతుంటాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు ఎన్నో వివాదాస్పదంగా మారాయి.ఈ క్రమంలోనే 2016 నవంబర్ 26 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు.
ఆశ ఎన్ కౌంటర్ అనే పేరుతో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడంతో కోర్టు ఆదేశాల ప్రకారం సినిమా టైటిల్ మార్చి ప్రస్తుతం ట్రైలర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ కథ ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని కేవలం కల్పితం మాత్రమేనని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను నవంబర్ 26వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సోనియా ఆశ అనే టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఆనంద్ చంద్ర దర్శకత్వంలో కంచర్ల ప్రొడక్షన్ పై నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 26 వ తేదీ విడుదల కానుంది.ఇక రామ్ గోపాల్ వర్మ తదుపరి కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా మరొక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.