వరుడు కావలెను మూవీ రెండు రోజుల కలెక్షన్లు అంత తక్కువా?

యంగ్ హీరో నాగశౌర్య సినీ కెరీర్ లో ఊహలు గుసగుసలాడే, ఛలో మినహా మరో భారీ బ్లాక్ బస్టర్ లేదనే సంగతి తెలిసిందే.శుక్రవారం రోజున నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

 Young Hero Naga Shoruya Varudu Kavalenu Movie Two Days Collections Details Here,-TeluguStop.com

సినిమా కథ, కథనంలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ వరుడు కావలెను మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 2 కోట్ల 31 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు 8.6 కోట్ల రూపాయలకు అమ్ముడవగా కనీసం 9 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందని చెప్పవచ్చు.ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే నైజాంలో 57 లక్షల రూపాయలు, సీడెడ్ లో 20 లక్షల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాల్లో 25 లక్షల రూపాయలు, కృష్ణా గుంటూరు జిల్లాలలో 31 లక్షల రూపాయలు షేర్ కలెక్షన్లు వచ్చాయి.

Telugu Naga Shoruya, Nagashourya, Ritu Varma, Varudu Kavalenu, Varudukavalenu, Y

ఉత్తరాంధ్రలో ఈ సినిమా 17 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించగా నెల్లూరులో ఈ సినిమాకు 9 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో ఈ సినిమాకు 72 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.థమన్, విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఈ సినిమాలోని దిగు దిగు దిగు నాగ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాతో నాగశౌర్య, రీతూవర్మ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

వీక్ డేస్ లో ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ గురించి ఒక అంచనాకు రావచ్చు.దసరాకు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఈ నెల 29వ తేదీన రిలీజైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube