చిన్నారి ఐడియాకి ఫిదా అవుతున్న నెటిజెన్స్.. వీడియో వైరల్!

చిన్నారి ఐడియా చూసి నెటిజెన్స్ షాక్ అవ్వడమే కాదు ఆ బాలికను అభినందిస్తున్నారు కూడా.ఇంత చిన్న వయసులో ఆమె మేధా శక్తికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

 School Girl Wins Children Climate Prize For Designing Solar-powered Ironing Cart-TeluguStop.com

ఇప్పటి యువత తలచుకుంటే ఎంత విజయాన్ని అయినా పట్టుదలతో, కృషితో సాదించ గలరు అని ఆమె మరొక సారి నిరూపించింది.ఇంతకీ ఆ చిన్నారి టెక్నాలిజీని ఉపయోగించుకుని ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.

అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం ఎంత పెరిగి పోతుందో అందరికి తెలిసిన విషయమే.

కానీ అన్ని తెలిసిన కూడా ఏమీ చేయలేని పరిస్థితి.ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పాటు మనం కూడా పరిగెత్తక పోతే జీవించడం కష్టం.

అందుకే ప్రతి మనిషీ టెక్నాలజీ తో పాటు ముందుకు వెళ్తున్నాడు.ఫలితంగా వాహనాల కారణంగా కాలుష్యం రోజురోజుకూ పెరిగి పోతుంది.

దీంతో ఈ కాలుష్యం నుండి బయట పడేందుకు చిన్నారి గొప్ప ఆలోచన చేసింది.వాతావరణ కాలుష్యం నుండి బయట పడేందుకు ప్రపంచ దేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే ప్రజలకు దీనిపై అవగాహనా లేక ఈ సోలార్ సిస్టం అందుబాటు లోకి రాలేక పోయింది.మన దేశంలో ఇప్పటికే బొగ్గును చాలా అవసరాల కోసం వినియోగిస్తున్నాం.

మరీ ముఖ్యంగా ఐరన్ చేసే వారు బొగ్గునే ఎక్కువ వినియోగిస్తారు.అయితే ఈ బొగ్గు వాడకాన్ని ఎలా అయినా తగ్గించాలని భావించిన ఒక చిన్నారి అందుకోసం మంచి ఐడియా కూడా ఆలోచించింది.తమిళనాడుకు చెందిన వినీష అనే చిన్నారి కాలుష్యాన్ని తగ్గించాలని భావించి ఒక సైకిల్ కు పెద్ద సోలార్ బాక్స్ ను ఏర్పాటు చేసి, పైన సోలార్ ప్యానెల్లు అమర్చింది.

ఆ సోలార్ నుండి వచ్చిన ఎనెర్జీ ద్వారా కరెంట్ ను ఉత్పత్తి చేసి ఆ కరెంట్ ను ఫ్యాన్, మొబైల్ ఛార్జ్, ఇస్త్రీ బాక్స్ పెట్టుకునే విధంగా సాకెట్స్ ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ చిన్నారి కష్టాన్ని బిబిసి ఛానెల్ ఒక డాక్యుమెంటరీ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube