బిగ్ బాస్ సీజన్ 5లో ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ సోమవారం నాడు జరిగింది.వేటగాడు.
కోతులు కాన్సెప్ట్ లో ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్ విచిత్రంగా సాగాయి.ఈ నామినేషన్స్ లో భాగంగా ఈసారి 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు.
అందులో శ్రీరాం చంద్ర, జశ్వంత్, రవి, ప్రియ, కాజల్, అనీ, సిరి ఉండగా సీక్రెట్ రూం లో ఉన్న లోబో కూడా డైరెక్ట్ నామినేట్ అయ్యారు.
ఈ నామినేషన్స్ టైం లో ప్రియ రవిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ చాలా సిలీగా అనిపించింది.
అయితే ప్రియ సన్నీని ఇరికించేద్దాం అనుకున్నట్టుగా రవిని నామినేట్ చేస్తూ ఆ రీజన్ చెప్పగా సన్నీ కూడా ఆమె గేం ప్లాన్ అర్ధం చేసుకుని రవి నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు.అయితే రవి నామినేషన్ అన్నది ప్రియ చెప్పిన కారణమే కాదు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన శ్వేత టాస్క్ ఓడిపోవడానికి కారణం రవినే కాబట్టి రవిని సన్నీ నామినేట్ చేశాడు.
ఫైనల్ గా 7వ వారం నామినేషన్స్ లో 8 మంది హౌజ్ మెట్స్ ఉన్నారు.వీరిలో ఎవరు ఈ వీకెండ్ హౌజ్ కు గుడ్ బై చెబుతారు.
ఎవరు సేఫ్ అవుతారు అన్నది చూడాలి.