మెగా ఫ్యామిలీని మంచు విష్ణు పిలవకపోవడానికి అసలు కారణాలివేనా?

మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి మంచు విష్ణు చిరంజీవిని, మెగా ఫ్యామిలీ నటులను ఆహ్వానించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Reasons Behind Manchu Vishnu Not Invited Megastar Chiranjeevi Details, Chiranjee-TeluguStop.com

బాలకృష్ణతో పాటు కోట శ్రీనివాసరావు మరి కొందరు నటులను మంచు విష్ణు స్వయంగా ఆహ్వానించారు.అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను మాత్రం మంచు విష్ణు కలవలేదని తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్ నుంచి మంచు విష్ణు అందరినీ కలుపుకొని పోతానని చెబుతున్నారని కానీ చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇతర నటులను పిలవడానికి మంచు విష్ణుకు ఉన్న సమయం మెగా ఫ్యామిలీ హీరోలను పిలవడానికి లేదా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మెగా ఫ్యామిలీని పిలవకుండా మంచు ఫ్యామిలీ గట్టి దెబ్బ కొట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మంచు విష్ణు ప్యానల్ విభజించు పాలించు అనే విధానాన్ని పాటిస్తోందని మెగాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Maa, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj-Mov

రాబోయే రోజుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు, ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చినవారికి దూరంగా ఉండే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే విష్ణు అభిమానులు మాత్రం మెగా హీరోలకు ఆహ్వానం అందకపోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Maa, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj-Mov

ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంచు విష్ణు వాళ్లను పిలవలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచి చిరంజీవి, మిగతా మెగా హీరోలు హాజరు కాకపోతే నెగిటివ్ కామెంట్లు వినిపిస్తాయని విష్ణు వర్గం భావించినట్లు తెలుస్తోంది.భవిష్యత్తులోనైనా విష్ణు చిరంజీవిని కలుస్తారో లేదో చూడాల్సి ఉంది.ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు గెలిచిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు ఆ ప్యానల్ కు మద్దతు ఇచ్చిన కుటుంబాన్ని ఆహ్వానించకూడదని భావించారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube