మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందనున్న మ్యూజికల్ మూవీ మ్యూజిక్ స్కూల్ఎంతో విశిష్టమైన దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది.తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ పవిత్రమైన రోజున చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సిద్ధం కావడం అనేది అందరిలో తెలియని ఓ పాజిటివిటీని నింపింది.పాపారావు బియ్యాల దర్శకుడిగా తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్కూల్ మూవీని తెరకెక్కిస్తుండటం సినీ ప్రేక్షకాభిమానుల్లో తెలియని ఓ ఎగ్జయిట్మెంట్ క్రియేట్ అయ్యింది.
శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది.
సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే, ఆయన అసోసియేట్ పాల్ సౌండెర్ ఇందులో భాగమవుతున్నారు.
నేటి విద్యావ్యవస్థలో సృజనాత్మకత లేకుండా పోతుంది.వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేయడమే లక్ష్యంగా విద్యను మూస పద్ధతుల్లో బోధిస్తున్నారు.
దీని వల్ల పిల్లల్లో తెలియని ఒత్తిడి నెలకుంటుంది.పిల్లలకు చదువే లోకమైపోతుంది.
కళలు, ఆటలు కూడా జీవితంలో భాగమని తెలియడం లేదు.విద్యార్థుల జీవితంలో కళల ప్రభావాన్ని ఇనుమడింప చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని భావించిన ఈ చిత్రంలో సందర్భానుచితంగా ఆ విషయాలను తెలియజేసేలా హాలీవుడ్ క్లాసిక్ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌లో మూడు పాటలుంటాయి.

ఈ సందర్భంగా.చిత్ర దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడం గొప్ప ప్రయాణంలా అనిపించింది.మ్యూజిక్ దానికి సంబంధించిన విజువల్స్‌ను తెరపై ప్రేక్షకుడికి గొప్ప అనుభూతినిస్తుంది.సినీ రంగానికి చెందిన వ్యక్తిగా బ్రాడ్ వే మ్యూజికల్స్‌కు నేను ఆకర్షితుడినయ్యాను.మ్యూజిక్, డాన్స్ కొరియోగ్రఫీ కాంబినేషన్లో స్టోరి నెరేషన్ అనేది స్టోరి లైన్‌ను చాలా బలంగా మార్చింది.ఈ సినిమాకు లెజెండ్రీ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించడమనేది గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు.
దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైన ఇళయరాజా ‘మ్యూజిక్ స్కూల్’
.