జుట్టుకు తేనె రాస్తే తెల్ల‌బ‌డుతుందా? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

తేనె రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.కేశాల‌కు కూడా తేనె ఎంతో మేలు చేస్తుంది.

 Does Applying Honey To The Hair Make It Whiter Honey, Hair, Hair Care, Hair Care-TeluguStop.com

అయితే జుట్టుకు తేనె రాస్తే తెల్ల బ‌డిపోతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు.కానీ, అందులో నిజమ‌నేదే లేద‌ని చెప్పాలి.

కేశాల‌కు స్వ‌చ్ఛ‌మైన తేనెను రాస్తే ఏ మాత్రం తెల్ల‌బ‌డ‌దు.పైగా బోలెడ‌న్ని పోష‌కాలు జుట్టుకు అందుతాయి.

అలాగే తేనెతో ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ ప్యాక్స్‌ను ట్రై చేస్తే గ‌నుక‌.జుట్టు రాల‌డం, చిట్ల‌డం, పొడి బార‌డం వంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌కు టాటా చెప్పొచ్చు.

మ‌రి లేటెందుకు ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల తేనె, మూడు స్పూన్ల‌ అలోవెర జెల్‌, ఒక స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి షవర్ క్యాప్ పెట్టు కోవాలి.ఇర‌వే లేదా ముప్పై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ లేని షాంపూ యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే డ్రై హెయిర్ స‌మ‌స్య త‌గ్గుతుంది.మ‌రియు కేశాలు షైనీగా, సాఫ్ట్‌గా మెరుస్తాయి.

Telugu Benefits Honey, Care, Care Tips, Honey, Latest-Latest News - Telugu

అలాగే ఒక బౌల్‌లో బాగా పండిన అర‌టి పండు పేస్ట్ రెండు స్పూన్లు, అవ‌కాడో పండు పేస్ట్ రెండు స్పూన్లు, నాలుగు స్పూన్ల తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.గంట అనంతరం త‌ల స్నానం చేయాలి.హెయిర్ ఫాల్‌తో బాధ ప‌డే వారికి ఈ ప్యాక్ బెస్ట్ అప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే కేశాలు స్ట్రోంగ్‌గా మారి.ఊడ‌టం త‌గ్గుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు స్పూన్ల బంగాళ‌దుంప ర‌సం, మూడు స్పూన్ల తేనె, ఒక ఎగ్ వైట్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత జుట్టు మొత్తానికి ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టించి.

అర గంట త‌ర్వాత మెడ్ బాత్ చేయాలి.ఈ ప్యాక్ వ‌ల్ల జుట్టు రాల‌డం మ‌రియు చిట్ల‌డం రెండూ త‌గ్గుతాయి.

మ‌రియు వైట్ హెయిర్ స‌మ‌స్య ద‌రి చేరకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube