ఈ లక్షణాలు కనబడితే మధుమేహం వస్తున్నట్టు

ఏ వ్యాధి అయినా, వచ్చిన కొత్తల్లోనే గుర్తుపట్టి, త్వరగా చికిత్స మొదలుపెట్టాలి.లేదంటే వ్యాధి ముదిరిపోతుంది.

 Early Signs Symptoms Of Diabetes Dry Mouth Headache Tired Feeling , Diabetes , D-TeluguStop.com

మొక్కగా ఉన్నప్పుడు వంచలేదు, అది వృక్షమై కీడు చేస్తుంది.ప్రమాదకర వ్యాధులలో మధుమేహం ఒకటి.

ఇది చాలా సామాన్యమైన వ్యాధి.దీన్ని మొదట్లోనే కనిపెట్టాలి.

ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* నోటి దుర్వాసన, చిగుళ్ళ వ్యాధి: మధుమేహం మోసుకొచ్చే ఇన్ఫెక్షన్స్ వలన, నాలుక, పళ్ళు, నోరంతా దెబ్బతింటుంది.రుచి సరిగా అనుభవించలేకపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ళు దెబ్బతినటం జరుగుతుంది.

* మూత్రం తరుచుగా రావడం : ఇది అందరికి బాగా తెలిసిన లక్షణం.ఒంట్లో పెరిగిన షుగర్ లెవెల్స్ తట్టుకోలేకే, శరీరం అధికంగా మూత్ర విసర్జన చేస్తుంది.

* ఇన్ఫెక్షన్స్ : మధుమేహం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ దాకా, అన్ని శరీరం మీద దాడిచేస్తాయి.తరచుగా జ్వరం రావడం, స్కిన్ మీద రాశేష్ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.

* నీరసం : ఎలాంటి శ్రమ లేకపోయినా, నీరసం వచ్చేస్తుంటుంది.మధుమేహం యొక్క ముఖ్య లక్షణాల్లో ఇదొకటి.

ఇవి మాత్రమే కాకుండా, చూపు మందగించడం, అరికాళ్ళలో మంట, చర్మం నల్లబడటం , దురద అతిగా వేయడం కూడా మధుమేహ వ్యాధి లక్షణాలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube