ఈ లక్షణాలు కనబడితే మధుమేహం వస్తున్నట్టు

ఏ వ్యాధి అయినా, వచ్చిన కొత్తల్లోనే గుర్తుపట్టి, త్వరగా చికిత్స మొదలుపెట్టాలి.లేదంటే వ్యాధి ముదిరిపోతుంది.

మొక్కగా ఉన్నప్పుడు వంచలేదు, అది వృక్షమై కీడు చేస్తుంది.ప్రమాదకర వ్యాధులలో మధుమేహం ఒకటి.

ఇది చాలా సామాన్యమైన వ్యాధి.దీన్ని మొదట్లోనే కనిపెట్టాలి.

ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.* నోటి దుర్వాసన, చిగుళ్ళ వ్యాధి: మధుమేహం మోసుకొచ్చే ఇన్ఫెక్షన్స్ వలన, నాలుక, పళ్ళు, నోరంతా దెబ్బతింటుంది.

రుచి సరిగా అనుభవించలేకపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ళు దెబ్బతినటం జరుగుతుంది.

* మూత్రం తరుచుగా రావడం : ఇది అందరికి బాగా తెలిసిన లక్షణం.ఒంట్లో పెరిగిన షుగర్ లెవెల్స్ తట్టుకోలేకే, శరీరం అధికంగా మూత్ర విసర్జన చేస్తుంది.

"""/" / * ఇన్ఫెక్షన్స్ : మధుమేహం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ దాకా, అన్ని శరీరం మీద దాడిచేస్తాయి.

తరచుగా జ్వరం రావడం, స్కిన్ మీద రాశేష్ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.* నీరసం : ఎలాంటి శ్రమ లేకపోయినా, నీరసం వచ్చేస్తుంటుంది.

మధుమేహం యొక్క ముఖ్య లక్షణాల్లో ఇదొకటి.ఇవి మాత్రమే కాకుండా, చూపు మందగించడం, అరికాళ్ళలో మంట, చర్మం నల్లబడటం , దురద అతిగా వేయడం కూడా మధుమేహ వ్యాధి లక్షణాలే.

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?