మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది.దసరాకు సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కాలేదు.
షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన తర్వాత సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సమయంలోనే ఆచార్య విడుదల దీపావళికి ఉంటుందని అన్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా ను డిసెంబర్ 17న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
అదేంటి అదే తేదీన పుష్ప సినిమా ఉంది కదా అంటారా.ఔను ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప సినిమా ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.కాని ఇప్పుడు ఆచార్య కు కూడా అదే తేదీ కావాల్సి వచ్చింది.
దాంతో ఖచ్చితంగా పుష్ప విడుదల తేదీ మార్చే అవకాశాలు ఉన్నాయి.అల్లు అర్జున్ ఖచ్చితంగా చిరంజీవికి పోటీగా వచ్చేంతటి సాహసం మాత్రం చేయడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రకారం వచ్చే సమ్మర్ కు పుష్ప ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ను అయితే పూర్తి చేస్తారు.
కాని విడుదల తేదీని మాత్రం సమ్మర్ కు వాయిదా వేస్తారనే టాక్ వినిపిస్తుంది.ఆచార్య కోసం పుష్ప త్యాగం నూటికి నూరు పాళ్లు నిజం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆచార్య సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు ఏర్పాట్లు జరిగాయి.ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమై క్లారిటీ ఇస్తారని నమ్మకంగా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.