రెండుసార్లు అబార్షన్ జరగడంతో డిప్రెషన్ కు గురైన నటి?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వుండే సెలబ్రిటీలకు ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు అని చాలా మంది భావిస్తారు.అయితే అలా భావించే వారి అభిప్రాయం పూర్తిగా తప్పని వారికి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయని తాజాగా నటి, టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ భార్య, గీతా బస్రా తెలియజేశారు.

 Geeta Basra Reveals Why She Spoke About Her Miscarriages Geetha Basra, Harbhajan-TeluguStop.com

తాజాగా ఈ నటి ఒక పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబమంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే హర్భజన్ సింగ్ తో కలిసి 2015లో ఏడడుగులు వేసిన ఈమె 2016లో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఒక మగ బిడ్డకు జన్మనివ్వడంతో తన ఆనందాన్ని అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నటి గీతా బస్రా తను మగ బిడ్డకు జన్మనివ్వడం కంటే ముందుగా రెండు సార్లు అబార్షన్ కావడం తనని ఎంతగానో కృంగ తీసిందని ఆ ఆలోచనలతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి పోయానని తెలిపారు.

ప్రతి మహిళ తన తల్లి కాబోతున్నానని తెలిసిన రోజు నుంచి తన బిడ్డను ఎప్పుడెప్పుడు చేతులలోకి తీసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుందని.అలాంటి సమయంలో అబార్షన్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేనిదని తెలియజేశారు.

Telugu Geetabasra, Geetha Basra, Harbhajan Singh-Movie

ఇలా నా విషయంలోనూ, స్నేహితుల విషయంలో కూడా జరిగింది.ఆ సమయంలో ఎంతో డిప్రెషన్లోకి వెళ్లి పోయినప్పుడు నా భర్త తన నాకు ఎంతో అండగా నిలిచారని,సెలబ్రిటీల జీవితాలు అంత సులభంగా ఉండవని వారు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఎన్నో కష్టాలను అనుభవిస్తారని తెలియజేశారు.ఎవరి విషయంలోనైనా ఇలా జరిగినప్పుడు వారు ఏమాత్రం బాధపడకుండా ఆశలు వదులుకోకుండా ధైర్యంగా ఉండటం కోసం నా అనుభవాలను అందరితో పంచుకోవాలనుకున్నానని ఈ సందర్భంగా నటి గీతా బస్రా వెల్లడించారు.ఇకపోతే వీరికి పుట్టిన పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టగా… ఈ ఏడాది జన్మించిన బాబుకు జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా అని పేరు పెట్టినట్లు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube