తెలంగాణలో పాదయాత్రల రాజకీయం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.ఒకప్పుడు రాజకీయ నాయకులు పాదయాత్రలు ఒక సదుద్దేశ్యంతో ప్రజల సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకోవచ్చనే ఉద్దేశ్యంతో చాలా అరుదుగా నాయకులు పాదయాత్రలు చేసే వారు.
కాని ఇప్పుడు పాదయాత్ర లు చేయడం వెనుక ఒక ప్రత్యేక ఎజెండాతో నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు.ఒకప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.
ఒకప్పటి రాజకీయాలు ఖరీదైన రాజకీయాలు కాదు.కాని ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలాంటివో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.
అయితే ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే వచ్చే నెల అక్టోబర్ 20 నుండి వై.ఎస్.షర్మిల పాదయాత్ర నిర్వహించబోతుంది.
అయితే వరుసగా అందరు నేతలు పాదయాత్రలు చేయడానికి ఎందుకు నిర్ణయించుకుంటున్నారనేది సామాన్య ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
అయితే ఏదైనా సభనో, దీక్షనో చేపడితే ఒకరోజు రెండు రోజులు వార్తలలో ఉండొచ్చు.కాని పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకోవడానికి వీలవడమే కాకుండా, ప్రజలకు పార్టీ గురించి తెలుస్తుంది.
అంతేకాక పాదయాత్ర జరిగినన్ని రోజులు వార్తల్లో ఉండడం ద్వారా క్షేత్ర స్థాయిలో నాయకులు కూడా ఉత్సాహపడుతారు.తద్వారా పాదయాత్ర ముందు పార్టీ పరిస్థితి కంటే పాదయాత్ర తరువాత పార్టీ పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉంటుంది.
తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం వంద శాతం ఉంటుంది.అంతేకాక ప్రభుత్వం పై ప్రజా సమస్యల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.
అందుకే పార్టీలు పాదయాత్ర వ్యూహాన్ని ఎంచుకుంటున్న పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.