తెలంగాణలో అధికారంలోకి మేమే వస్తాం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో అధికారంలోకి మేమే వస్తాం.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో 9 మాసాల్లో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం (కాంగ్రెస్ ప్రభుత్వం) అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

 We Will Come To Power In Telangana.t Pcc Chief Revanth Reddy-TeluguStop.com

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దళిత గిరిజన ఆదివాసి దండోరా ఆత్మగౌరవ సభ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లలో శుక్రవారం సాయంత్రం జరిగింది.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా ఈ సభకు హాజరయ్యారు.మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీత రెడ్డి అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సభకు హాజరైన అశేష పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి రేవంత్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సాక్షాత్తు సోనియాగాంధీని కలిసి మాట ఇచ్చి వెన్నుపోటు పొడిచారని దయ్యబట్టారు.

రాష్ట్రంలో స్వేచ్ఛ సామాజిక న్యాయం లేదని విపక్షాలను అణగదొక్కడం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Telugu Cm Kcr, Congress, Dalithagirijana, Geetha Reddy, Manikyam Takur, Raithu B

ఒక శాతం కూడా లేని సామాజిక వర్గానికి కేసీఆర్ తన మంత్రివర్గంలో నలుగురికి చోటు కల్పించి 12 శాతం ఉన్న మాదిగలకు రిక్త హస్తం చూపించారని ఆరోపించారు.మాదిగకలకు తగిన  ప్రాతినిధ్యం కల్పించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంటే ఆ హంతకుడుని ఆరు రోజులైనా పట్టుకోలేని అధ్వాన్న స్థితిలో పోలీసు యంత్రాంగం ఉందని ఆరోపించారు.హైదరాబాద్ నగరంలో ఏడు లక్షల సీసీ కెమెరాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న నగర పోలీస్ కమిషనర్.

హంతకుడుని పట్టుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని తీరా ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులు పై పోలీసులు దాడి చేసి గాయపరిచారు అని చెప్పారు.ఒక హంతకుడిని పట్టుకునేందుకు 200 మంది పోలీసు బృందాలుగా ఏర్పడి గాలించినా ఫలితం లేకపోయిందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube