ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలోని కంటెస్టెంట్స్ అందరూ ఒక ఎత్తయితే.అర్జున్ రెడ్డి భామా లహరి ఒకెత్తు.
లహరి తనకు తోచిన ఏ విషయం అయినా మనసులో పెట్టుకోకుండా.కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఈమె మాట్లాడే మాటలు పలు వివాదాలకు కారణమవుతుంటాయి.
అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రవర్తన ఇలా ఉందనుకుంటే పొరపాటు.లహరి నిజజీవితంలో కూడా ఏ విషయాన్ని అయినా ఈ విధంగానే తీసుకుంటారని ఆమె ఓ సందర్భంలో తెలియజేశారు.
బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేముందు ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ఇందులో భాగంగానే తనకు మద్యం తాగే అలవాటు ఉందని, అలాగని తాగుబోతుని కాదంటూ తెలియజేశారు.
ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు మితంగా మందుతాగే అలవాటు ఉందనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు.అదే విధంగా తను ఇలా ఉండటానికి గలకారణం చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని తెలిపింది.
అయితే ఆ స్వేచ్ఛను ఏవిధంగా దుర్వినియోగం చేసుకోలేదని తన కోసం తనకు నచ్చినట్టుగా ఉండటం కోసం తన తల్లిదండ్రులు తనకెంతో ఫ్రీడమ్ కల్పించారని తెలియజేశారు.
తను ఎలాంటి దుస్తులు ధరించిన ఇంట్లో నో అనే ఆన్సర్ రాదని… నువ్వు ఏదైనా వేసుకో.నీకు నచ్చినట్టుగా నువ్వుండనే సమాధానం మాత్రమే వస్తుందని లహరి తెలియజేశారు.ఏ విషయంలోనైనా నాపై నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుందని.గట్టిగా చెప్పాలంటే నాకు బలుపు ఎక్కువ.నా బలుపు నా ఫ్యామిలీ అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లహరి తన గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.
ఇక తన గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడిన అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని, కానీ తన ముందు తనను ఎవరైనా హర్ట్ చేసినట్టు మాట్లాడితే వారికి తన స్టైల్లోనే సమాధానం చెబుతానని ఈ అర్జున్ రెడ్డి బామ తెలియజేశారు.