బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 కంటెస్టెంట్లుగా గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న పేర్లలో ఉన్న కంటెస్టెంట్లు ఎంపికయ్యారు.జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సాయితేజ ఆ షోలో లేడీ గెటప్ తో ప్రేక్షకులకు చేరువయ్యారు.
ఆ తర్వాత సాయితేజ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోవడంతో పాటు తన పేరును ప్రియాంక సింగ్ గా మార్చుకోవడం గమనార్హం.
అయితే తాను జెండర్ మారినా తన తండ్రికి మాత్రం ఈ విషయం తెలియదని ప్రియాంక చెప్పుకొచ్చారు.
నా కోరిక కొద్దీ నేను అమ్మాయిగా మారానని అయినప్పటికీ ఎప్పటికీ నాన్నకు మాత్రం కొడుకునేనని ప్రియాంక అన్నారు.తనది శ్రీకాకుళం అని తల్లిదండ్రులు తల దించుకునే పని తాను ఎప్పుడూ చేయనని ఆమె పేర్కొన్నారు.
గతంలో పలువురు జబర్దస్త్ కమెడియన్లు బిగ్ బాస్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం ప్రియాంకకు దక్కింది.
చిన్నప్పటి నుంచి తాను అమ్మాయిలా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడ్డానని ప్రియాంక చెప్పుకొచ్చారు.బాల్యంలోనే అక్క బట్టలు వేసుకోవడం చేశానని ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అమ్మాయిగా మారిపోయానని అమ్మాయిగా మారినా అమ్మ సపోర్ట్ అయితే తనకు ఉందని ప్రియాంక సింగ్ వెల్లడించారు.

అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి ప్రియాంక భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.సర్జరీ చేయించుకున్న సమయంలో స్నేహితులే తనకు అండగా నిలిచారని ప్రియాంక సింగ్ అన్నారు.సర్జరీ కోసం తను సంపాదించిన డబ్బులనే ఖర్చు చేశానని ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చారు.ఇప్పుడు తాను అబ్బాయిని కాదని పూర్తిగా అమ్మాయిలా మారిపోయానని గతంలో ఒక సందర్భంలో ప్రియాంక వెల్లడించారు.
ప్రియాంక కామెడీకి ఫ్యాన్స్ ఉండటంతో కొన్నివారాల పాటు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.