ఆఫ్ఘనిస్థాన్లో కొద్దిరోజుల్లోనే ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లు రెడీ అయ్యారు.దాదాపు 20 సంవత్సరాల తర్వాత దేశం మళ్లీ తమ అధీనంలోకి రావడంతో.
తాలిబాన్లు సరికొత్త చట్టాలతో.కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
ఈ తరుణంలో ప్రారంభంలో ఇతర దేశాలకు సంబంధించి అంతర్గత విషయంలో జోక్యం ఉండదని తేల్చిచెప్పిన తాలిబాన్లు.భారత్ లో కాశ్మీర్ విషయంలో.
ఆ రీతిగానే వ్యవహరిస్తున్నట్లు అప్పట్లో తెలపగా తాజాగా ఈ మాట మార్చడం జరిగింది.మేటర్ లోకి వెళితే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు అనిచివేత గురవుతున్నారో అటువంటి ప్రాంతాలకు తాము అండగా ఉంటామని తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం హక్కుల కోసం పోరాటం చేస్తామని తాలిబాన్ కీలక అధికారి ప్రకటన చేశారు.కానీ దేశాల పై పోరాటం.చేసే ఉద్దేశ్యం లేదని కేవలం ముస్లింలు ఎక్కడైతే అణిచివేత గురవుతారో.ఆ ప్రాంతాల తరఫున తాలిబన్లు పోరాటాలు చేస్తారని స్పష్టం చేశారు.నీతో తాలిబాన్ల ప్రకటన వెనకాల చైనా తో పాటు మరి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు భారత్ భావిస్తోంది.కొత్తగా ఏర్పడిన ఆఫ్గనిస్థాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చైనా దేశం సహకారం అందిస్తున్నట్లు తాలిబాన్ కీలక అధికారులు ప్రకటన చేయడంతో.
భారత్లో అంతర్గత విభేదాలు సృష్టించడానికి తాలిబాన్లను ఉసిగొల్పడానికి కొన్ని ఉగ్రవాద సంస్థలతో పాటు చైనా రెడీ అయినట్లు.కేంద్రం భావిస్తోంది.
దీంతో కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది.