బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌.. అక్క‌డ వారే అధికారంలో ఉంటారంట‌..

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌మాదిరిగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు రేవంత్‌రెడ్డి ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌గా ఇప్ప‌డు బీజేపీ అద్య‌క్షుడు బండి సంజ‌య్ ఏకంగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు తెర‌లేపారు.

 Srinivas Goud Is Taking The Bjp To The Skies They Will Be In Power There Srini-TeluguStop.com

దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌ల్లో టెన్ష‌న్ పెడుతోంది.ఎందుకంటే గ‌తంలో చాలామంది ఇలాంటి యాత్ర‌ల వ‌ల్లే అధికారాన్ని ద‌క్కించుకున్నారు.

మ‌రి ఇప్పుడు బీజేపీ కూడా ఇలాంటి యాత్ర‌ల‌కు పోవ‌డంతో ఆయ‌న కూడా ఇలాగే టీఆర్ ఎస్ ఓట్ల‌కు గండి కొడ‌తార‌ని అంతా భావిస్తున్నారు.

దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్ మంత్రులు మాట‌ల యుద్ధం మొద‌లు పెట్టారు.

ఈ క్ర‌మంలోనే రీసెంట్ గా ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్స్ట్ క్లస్టర్స్ కు జ‌రిగిన శంకుస్థాపనలో భాగంగా కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చారు.అయితే కార్య‌క్ర‌మంలో భాగంగా ముందు కిషన్ రెడ్డి ప్రోగ్రామ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

ఇకా ఆయ‌న తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కిష‌న్‌రెడ్డి కూడా ఊహించని రేంజ్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఏకంగా బీజేపీని ఆకాశానికి ఎత్తేసి గొప్ప‌గా పొగిడేశారు.

Telugu Bandi Sanjay, Kishan Reddy, Prahasangrama, Club Hyderbabd, Srinivas Goud,

ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తుంటే కేంద్రంలో బీజేపీ అలాగే తెలంగాణ‌లో టీఆర్ ఎస్ మ‌రో 15 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కు అధికారంలో ఉండటం ఖాయమ‌ని తెలిపారు.దీంతో అంద‌రూ షాక్ అయిపోయారు.అలాగే రెండు పార్టీలు క‌లిసి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలంటూ కోరారు.అయితే ఇక్క‌డే ఆయ‌న మాట‌లు అంద‌రినీ షాక్ కు గురి చేస్తున్నాయి.బీజేపీ అధికారంలో ఉంటంఉద‌ని చెప్ప‌డం ఆ పార్టీకి ప్ల‌స్ అవుతుంది క‌దా.అంటే రాష్ట్రంలో కూడా బీజేపీకి ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

టీఆర్ ఎస్ మంత్రి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో గులాబీ అధిష్టానం కూడా సీరియ‌స్‌గా ఉందంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube