టీఆర్ ఎస్ నేత‌ల‌ను మించి కేసీఆర్‌ను పొగుడుతున్న మోత్కుపల్లి.. ఆ ప‌ని చేయ‌కుంటే..

రాజ‌కీయ నేత‌లకు అయినా స‌రే అధిష్టానం ను పొగిడితేనే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోక్షం ల‌భించేది అన్న‌ట్టు గా త‌యారైపోయింది.ఎందుకంటే ఏ ప‌ద‌వి కావాల‌న్నా లేకుంటే తాము అనుక‌న్న స్థాయికి ఎద‌గాల‌న్నా స‌రే అధిష్టానం అనుగ్ర‌హం త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్టు త‌యార‌యింది.

 Motkupalli Praising Kcr Beyond Trs Leaders If That Work Is Not Done, Motkupalli,-TeluguStop.com

ఈ నేప‌థ్యంలోనే మ‌రీ ఎక్కువ‌గా గులాబీ బాస్‌ను ఆకాశానికి ఎత్తేసే ప‌ని పెట్టుకుంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు.అయితే ఇప్పుడు ఓ నేత మాత్రం టీఆర్ ఎస్ కాక‌పోయినా స‌రే ఆ పార్టీ నేత‌ల‌ను మించి మ‌రీ కేసీఆర్‌ను పొగిడేస్తున్నారు.

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ‌లో దళిత బంధు పథకాన్ని పెట్ట‌డంతో ఈ ప‌థ‌కాన్ని మొద‌టి నుంచి పొగిడేస్తున్నారు మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.ఇక ఆయ‌న బీజేపీని వీడిన‌ప్ప‌టి నుంచి కేఈసార్‌ను ఏదో విష‌యంలో పొగ‌డుతూనే ఉన్నారు.

ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసారు.కేసీఆర్ క‌చ్చితంగా తెలంగాణ‌లో దళితబంధు పథకాన్ని నూరు శాతం అమలు చేస్తాడ‌ని అది ఆయ‌న నైజం అని చెప్పుకొచ్చారు.

ఎందుకంటే కేసీఆర్ మాటల్లో నిజాయితీ ఉంద‌ని, ఆయ‌న చెప్పారంటే క‌చ్చితంగా చేస్తార‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

Telugu Bjp, Dalita Bandhu, Motkupalli, Huzurabad, Motkupalli Kcr, Trs, Ts-Telugu

ఇక ఈ మాట‌లు కూడా స‌రిపోవ‌ని అనుకున్నారో ఏమో గానీ ఓ అడుగు ముందుకు వేసి మ‌రీ తెలంగాణ‌లో ఒకవేళ కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌త‌కాన్ని గ‌న‌క అమలు చేయ‌క‌పోతే తాను పుణ్యక్షేత్రమైన యాదాద్రి న‌ర్సింహ‌స్వామి సాక్షిగా ఆ కొండ మీద సూసైడ్ చేసుకుంటానని షాకింగ్ న్యూస్ చెప్పారు.అంటే ఈ మాట‌ల‌తో కేసీఆర్ మీద మోత్కుప‌ల్లి గ‌తంలో ఎన్న‌డూ లేనంత న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారన్న మాట‌.అయితే ఇదే స‌మ‌యంలో ఇంకోవైపు రేవంత్ పైన తీవ్ర ఆరోపణలు చేయ‌డం గ‌మ‌నార్హం.

మొత్తానికి ఆయ‌న టీఆర్ ఎస్‌లోకి వెళ్లేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంతా అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube