స్పేషల్(spatial) అంటే తెలుగులో స్థలాన్ని ఆక్రమించుకోవడం అని అర్ధం.ఈ పదాన్ని రకరకాల రంగాల్లో వివిధ అర్ధాలతో వాడుతుంటారు.
ఆడియో టెక్నాలజీలో కూడా స్పేషల్ ఆడియో పేరిట సరికొత్త ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నారు.సాధారణంగా మనం హోమ్ థియేటర్లు, టీవీ లేదా ఇంకేదైనా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సౌండ్ వినేటప్పుడు.
ముందు లేదా వెనుక, ఇరుపక్కలా వినపడుతుంది.మనం సౌండ్ స్పీకర్లు సెట్అప్ చేసుకునే విధానాన్ని బట్టి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది.
కానీ స్పేషల్ ఆడియోలో స్పీకర్ ఎక్కడున్నా సరే 360 డిగ్రీలలో సౌండ్ వినిపిస్తోంది.పైనుంచి, పక్క నుంచి ఇలా చుట్టూ ఉన్న అన్ని కోణాల నుంచి శ్రోతలకు సౌండ్ వినిపించేందుకే ఈ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ టెక్నాలజీని తమ యూజర్లకు అందించడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది.
మొదటగా ఐఓఎస్ యూజర్లకు స్పేషల్(spatial audio) ఆడియో సపోర్ట్‌ను అందించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.ఐఓఎస్ లేదా ఐపాడ్ ఓఎస్ 14.6 లపై రన్ అవుతున్న ఐఫోన్, ఐప్యాడ్లలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ప్రస్తుతానికైతే ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్స్ మాక్స్ యూజర్లు నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు చూసే సమయంలో ఈ స్పేషల్ ఆడియో ఎక్స్పీరియన్స్ పొందొచ్చు.యాపిల్ టీవీ, మ్యూజిక్‌లలో కూడా ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
రాబోయే రోజుల్లో మాక్(Mac), యాపిల్ టీవీ (Apple TV)లలో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుందని తెలుస్తోంది.

ఈ ఫీచర్‌ను వినియోగించి ఆడియో వినడానికి ముందస్తుగా మీరు ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్ మాక్స్ లను మీ ఐఫోన్ లేదా ఐపాడ్ కి కనెక్ట్ చేయండి.తరువాత మీ ఐఫోన్ లో నెట్‌ఫ్లిక్స్ యాప్ ను ఓపెన్ చేయండి.5.1 సరౌండ్ లేదా డాల్బీ(dolby audio) అట్మోస్ అనుభూతిని కల్పించే వీడియో కంటెంట్ ను ఎంపిక చేసుకోండి.తర్వాత మీ డివైస్ స్క్రీన్ లో కుడివైపు పైన మూలలోనున్న కంట్రోల్ పానెల్ పై క్లిక్ చేయండి.
అప్పుడు ఆడియో ఆప్షన్స్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసి వాల్యూమ్ స్లయిడర్‌ను ప్రెస్ చేసి పట్టుకొని స్పేషల్ ఆడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.