పాన్ ఇండియా సినిమాల్లో మాకు అవకాశం ఇవ్వరు.. పృథ్వీ రాజ్

తెలుగు సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి కమెడియన్ గా నిలిచాడు.1993లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఖడ్గం సినిమాతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో బాగా నవ్వించాడు.

 Comedian Prudhvi Kickstarts Kalam Rasina Kathalu Film Prudhvi Raj, Kalam Rasina-TeluguStop.com

ఇక బయట కూడా తన మాటలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు.ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వరు అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు.

నిజానికి పృథ్వీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా తను మాట్లాడిన మాటలతో తెగ ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటాడు.ఇక తన నోటికొచ్చినట్లు మాట్లాడటంతో కొన్ని హోదాలు కూడా కోల్పోయాడు.

పలువురు స్టార్ హీరోల గురించి చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడాడు.ఇక రాజకీయాల్లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

కొన్ని కారణాలవల్ల సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయాడు.

Telugu Kalamrasina, Kickts, Prudhvi Raj, Tollywood-Movie

ఇక గతంలో పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ విషయంలో తన దూకుడును తగ్గించాడు.అంతేకాకుండా ఆయనను ఉద్దేశించి పాజిటివ్ గా మాట్లాడటం ప్రారంభించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.

Telugu Kalamrasina, Kickts, Prudhvi Raj, Tollywood-Movie

ఎమ్ ఎన్ వీ సాగర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కాలం రాసిన కథలుఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి పాల్గొనగా కొన్ని విషయాలు పంచుకున్నాడు పృథ్వీరాజ్.పాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలవరు అంటూ నన్ను పిలిచినా సినిమాలకు సపోర్టు అందించాలని ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యాను అంటూ తెలిపాడు.సినిమాలలో చిన్న పెద్ద అనేది ఉండదంటూ.

ఏ సినిమాకైనా ఒకే కెమెరా, ఒకే కష్టం ఉంటుందని కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube