మెగా అనౌన్స్‌మెంట్‌కు మెహర్ రమేష్ రెడీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాస్ హిట్టు కొట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫుల్ ధీమాగా ఉన్నారు.

 Mega Euphoric Chiru 154 Update Tomorrow, Chiru 154, Chiranjeevi, Meher Ramesh, T-TeluguStop.com

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.

కాగా చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో మెగాస్టార్ సినిమాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్‌లు ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌లు రెడీ అవుతున్నాయి.

కాగా ఇందులో భాగంగా చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ను ఆగస్టు 22న ఉదయం 9 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అటు చిరు పుట్టినరోజు కానుకగా ఆచార్య, దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్, లూసిఫర్ రీమేక్ అప్‌డేట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి తన పుట్టినరోజున మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు బాస్ రెడీ అవుతుండటంతో ఈ అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి మెగాస్టార్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

కాగా చిరంజీవి ఆచార్య చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube