1963 జనవరి ఉదయం పూట పాండీ బజార్ లోని భారత్ కేఫ్ ముందు వో పడుచు కుర్రాడూ, మధ్య వయసులో ఉన్న వో పెద్ద మనిషి నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.ఆ దారినే కార్లో జోరుగా వెళ్తున్న యువ దర్శకుడొకాయన … మెరుపులాంటి ఈ అబ్బాయిని చూసి కారు వెనక్కి తిప్పి వారి దగ్గరకు వచ్చాడు.
సార్ ఆ అబ్బాయిది తెలుగా తమిళా? అని అడిగాడు పెద్దమనిషి.ఆయన నవ్వి అసలుసిసలైన తెలుగు అన్నారు.
సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉందా ? అని మళ్లీ అడిగాడు ఆ దర్శకుడు …అందుకేగా ఈ ఊరొచ్చింది అంటూ ఆయన ఆ యువకుణ్ని ఆ దర్శకుడికి పరిచయం చేశారు.రేపు మా ఆఫీస్ కొచ్చి తనను కలుసుకోమని చెప్పి వెళ్లిపోయాడు ఆ యువ దర్శకుడు! వాళ్ల ముగ్గురులో ఒకరు కృష్ణ , మరొకరు డైరెక్టర్ శ్రీధరు, ఇంకొకరు ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవంటిగంటి కుటుంబారావు.
మర్నాడు కృష్ణ ఆ డైరెక్టర్ ఆఫీస్ కు వెళ్లారు.తమిళం బాగా నేర్చుకోండి నా కాదరిక్క నేర మిల్లై లో వేషం ఇస్తాను అన్నాడు శ్రీధర్….వాళ్లే తమిళం నేర్పడం ప్రారంభించారు.ఒక నెల గడిచింది.
కృష్ణకు తమిళ్ అంతగా రాలేదు.శ్రీధర్ కాదలిక్క నేర మిల్లై ఆరంభించేందకు ఉపక్‌ుమించాడు.
తమిళ్ ఇంకా బాగా నేర్చుకోండి తర్వాత చిత్రంలో వేషమిస్తానన్నాడు శ్రీదర్.అక్కడి నుంచి వాళ్లే తమిళం నేర్పటం ప్రారంభించాడు.
ఒక నెల గడిచింది.కృష్ణకు తమిళ్ పట్టుబడ లేదు.
శ్రీధర్ కాదలిక్క నేరమిల్లై సినిమా ప్రారంభించేందుకు ఉపక్రమించాడు.ఇంకా బాగా నేర్చుకోండి నా తర్వాత చిత్రంలో అవకాశం ఇస్తాను అన్నాడు.
అంతకు ముందు ఇండియన్ పీపుల్స్ థియేటర్ వారి నాటకాల్లో స్వర్గీయ డాక్టర్ రాజారావుగారి నిర్వహణలో ఇచ్చిన అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు.నాటి రంగస్థల అనుభవాలు అతన్ని ఉత్సాహపరిచి సినిమా నటుడు కావాలనే కోరికను రేకెత్తించినవి.1960లో బిఎస్సీ చదువుకునేటప్పుడు ఆ కోరిక పెరిగి పెద్దయికూచున్నది.అప్పుడు మద్రాసు వచ్చి ప్రయత్నించాడు.
ఆప్రయత్నం సఫలం కాలేదు.
నిరుత్సాహంతో ఇంటికి వచ్చేసిన కృష్ణ ఒక యేడాది పైబడి గడిచాక ఓ రోజు పేపర్లో బాబూ మూవీస్ ప్రకటనకు అప్లై చేశాడు.
సినిమాకు సంబంధించిన నటన అంతా కృష్ణ బాబూ మూవీస్ వారి స్కూల్లో నేర్చుకున్నాడు.కారు డ్రైవింగ్, గుర్రపు స్వారి, ఫైట్స్, న్రుత్యాలు, స్కూటర్ నడపటం.
ఒకటేమిటీ ఒక హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ వాళ్లే నేర్పించారు.ఈ స్కూల్లో అతని గురువులు దర్శకులు శ్రీ ఆదుర్తి, శ్రీ.
కె విశ్వనాథ్ లు.
కన్నె మనసులు చిత్రంలోని పతాక సన్నివేశాలలో అపూర్వమయిన నటన ప్రదర్శించాడు కృష్ణ.గూఢాచారి 116 చిత్రంలో అతడికి మంచి పేరు వచ్చింది.అన్ని తరగతుల వారిని ఆకర్షించి ఆకట్టుకుంది.
కృష్ణ నటన గూఢచారి 116లో.సినిమాలు చూడడం, స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం, నటనలో కొత్త సంగతులు తెలుసుకోవడం అతనికి సరదాలు.
గొప్ప నటుడిగా రూపొందాలన్నది అతడి వాంఛ.అది ఫలించే వారకూ అతను నటనలో నిర్వరామ పరిశ్రమ చేస్తూనే ఉంటాడు.