మళయాళ నటుడికి తెలుగులో ఆఫర్లు.. చరణ్, మహేష్ సినిమాల్లో..!

మళయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కు తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ లేటెస్ట్ గా మరో రెండు తెలుగు స్టార్ సినిమాల్లో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది.

 After Pushpa Fahad Fazil Ram Charan Mahesh Movie Offers , Allu Arujun, Fahad Faz-TeluguStop.com

అందులో ఒకటి రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కాగా మరొకటి సూపర్ స్టార్ మహేష్ సినిమా అని తెలుస్తుంది.ఆర్సీ 15 సినిమాలో చరణ్ తో ఢీ కొట్టబోతున్నాడట ఫహద్ ఫాజిల్.

ఇక ఈ సినిమాతో పాటుగా త్రివిక్రం, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా విలన్ గా ఫహద్ ని ఫిక్స్ చేసినట్టు టాక్.మళయాళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఫహద్ ఫాజిల్ కు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

అతను నటిస్తున్న సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.పుష్ప సినిమాలో విలన్ గా ఫహద్ తన వీర ప్రతాపం చూపిస్తాడని అంటున్నారు.మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ అంటే ఫహద్ కి తెలుగులో స్టార్ డం వచ్చే ఛాన్స్ ఉంది.తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా తను మళయాళంలో చేస్తున్న సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు ఫహద్ ఫాజిల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube