ఈ నెలలోనే మంత్రి వర్గ విస్తరణ ? కేసీఆర్ కంగారేంటో ?

హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.ఇక్కడ గెలుపుపై అనేక అనుమానాలు ఆయనకు నెలకొన్నాయి.

 Kcr Is Going To Expand The Ministerial Category Telangana Cm, Kcr, Ktr, Cabinet,-TeluguStop.com

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కొండా సురేఖ వంటి వారిని ఢీ కొట్టాలంటే అది ఆషామాషీ కాదని, దీనికి తోడు ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని గుర్తించారు.అలాగే రకరకాల సంస్థల ద్వారా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసినా, అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు ఆ సర్వేలు , ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం , ఇలా అన్ని పరిణామాలను లెక్కలు వేసుకుంటున్నారు.

కేసీఆర్ ఓట్ బ్యాంక్ టిఆర్ఎస్ కు దూరమైందనే విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఈ పథకాన్ని ప్రకటించినా ఇంకా కెసిఆర్ లో సంతృప్తి మాత్రం కలగడం లేదు.

అందుకే ఉప ఎన్నికలకు ముందుగానే మంత్రివర్గాన్ని విస్తరించాలని కెసిఆర్ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ నెలాఖరులోపు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి కీలకమైన పదవులు కట్టబెట్టాలని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీఎంవో లో దళిత అధికారిని రాహుల్ బొజ్జా ను కేసీఆర్ నియమించారు.ఈ విషయాన్ని బహిరంగంగా ఆయన ప్రకటించారు.

Telugu Etela Rajendar, Hujurabad, Kcr, Konda Surekha, Telangana Cm-Telugu Politi

గత సీఎం లో ఆ సామాజికవర్గానికి చెందిన అధికారులు ఎవరూ పని చేయలేదు.అయితే ఇప్పుడు మాత్రం ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు మంత్రివర్గం తో పాటు, సీఎంలో ఆ సామాజికవర్గానికి చెందిన అధికారులకు, ఎమ్మెల్యేలకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అసంతృప్తి తలెత్తకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ఈ సంకేతాలు ఆనందాన్ని కలిగిస్తుండగా, దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రస్తుత ప్రాధాన్యం దృష్ట్యా, మంత్రి పదవి దక్కబోతోంది అనే ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube