పాములను కూడా పూజించే సంస్కృతి మనది కాగా అదే పాము ఇళ్లల్లోకి వస్తే భయపడిపోయి చంపే ప్రయత్నం చేస్తుంటాం.అయితే భారతీయ సంస్కృతి ప్రకారం పుట్టలో పాలు పోసి నాగదేవుడిని కొలవడం మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన ఆచారం.
అయితే, ఈ క్రమంలనే పెళ్లి కాని యువతులు, మహిళలు నాగుపాముకు పాలు పోస్తుంటారు.నాగదేవత తమ మొక్కులను తీరుస్తుందని నమ్ముతుంటారు భక్తులు.
కాగా ఈ పంచమి పర్వదినాన ఓ డిఫరెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.
ఇటీవల కాలంలో యూత్ బర్త్ డే సెలబ్రేషన్స్ డిఫరెంట్‌గా చేసుకుంటున్నారు.బర్త్ డే బంప్స్ అంటూ ఒకరిని ఒకరు కొట్టుకోవడం, పార్టీలు చేసుకోవడం కామన్ అయింది.
కాగా, నాగుపాము బర్త్ డే ఈ రోజు అని కొందరు యువకులు పాముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తున్నది.ఈ వీడియోలో పడగ విప్పిన నాగు పాము చుట్టూ చేరి ‘హ్యాపీ బర్త్ డే టూ యూ.హ్యాపీ బర్త్ డే నాగోబా’ అంటూ హల్‌చల్ చేశారు యువకులు.ఈ ఘటన రెండేళ్ల కిందట జరిగినా నాగుల పంచమి సందర్భంగా జరిగింది.
అయినప్పటికీ ఈ రోజు నాగుల పంచమి కాగా మళ్లీ హల్‌చల్ చేస్తోంది.ఇకపోతే మహిళలు పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి, పూలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
స్వీట్ పుట్టల వద్ద పెట్టి తమ కష్టాలు తీర్చాలని నాగదేవతను వేడుకుంటారు.ఈ నాగపంచమి రోజున సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు.
అయితే, నాగుల పంచమి సందర్భంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ అటవీ శాఖ తెలిపింది.పాములు పట్టే వారికి ఈ సందర్భంలో ఎవరూ డబ్బులివ్వొద్దని తెలంగాణ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది.