త‌ర‌చూ చిరాకు ప‌డుతున్నారా? అయితే ఈ ఫుడ్స్‌ను దూరం పెట్టాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రు చీటికి, మాటికి చిరాకు ప‌డుతూ ఉంటారు.ఆ చిరాకులోనే ఇత‌రుల‌పై అర‌వ‌డ‌మో, తిట్ట‌డ‌మో చేస్తుంటారు.

ఇలా నాలుగైదు సార్లు జ‌రిగితే ఎదుటి వారు పెద్దగా ప‌ట్టించుకోరు.కానీ, ప‌దే ప‌దే ఇలానే జ‌రుగుతుంటే.

వారికి విసుగు పుట్టి మ‌న‌కు దూరంగా వెళ్లి పోతుంటారు.అంత వ‌ర‌కు తెచ్చుకోకుండా ఉండాలీ అంటే ఖ‌చ్చితంగా చిరాకును కంట్రోల్ చేసుకోవాలి.

అలా చేసుకోవాలీ అంటే కొన్ని కొన్ని ఆహారాల‌కు దూరంగా ఉండాలి.మ‌రి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్లు తినేందుకు రుచిగా ఉన్నా.ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.ముఖ్యంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చిరాకు కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే షుగ‌ర్‌, షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్ల‌కు దూరంగా ఉండండి.సోడా ఉప్పు అధికంగా తీసుకోవ‌డం వ‌ల్లా చిరాకు ఎక్కువ‌గా వ‌స్తుంటుంది.సోడా ఉప్పు వేసిన వంట‌లు తీసుకోవ‌డం వ‌ల్ల‌ మొద‌ట శక్తి వేగంగా పెరిగినా.

ఆ త‌ర్వాత అకస్మాత్తుగా త‌గ్గిపోతుంది.దాంతో నీర‌సం.

ఆ వెంట‌నే చిరాకు పుట్టుకొస్తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాఫీ.అల‌స‌ట‌, ఒత్తిడి, టెన్ష‌న్‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను దూరంగా చేయ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.అయితే అదే కాఫీని అధికంగా తీసుకుంటే మాత్రం ఒత్తిడి, ఉద్రిక్తత పెరిగిపోయి.

Advertisement

తీవ్ర‌మైన చిరాకుకు దారి తీస్తుంది.కాబ‌ట్టి, కాఫీని ఎప్పుడూ లిమిట్‌గా తీసుకోవాలి.

జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మానసిక స్థితిని గంద‌ర గోళం చేసేసి చిరాకును పుట్టిస్తాయి.అందు వ‌ల్ల‌, ఇటువంటి ఆహారాలను ఖ‌చ్చితంగా దూరం పెట్టాల్సి ఉంటుంది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చిరాకుకు కార‌ణ‌మ‌య్యే ఆహారాల‌నే తెలుసుకున్నాము.అయితే చిరాకును కంట్రోల్ చేసే ఫుడ్స్ కూడా ఉన్నాయి.బాదం, వేరుశెనగలు, వాల్ న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు, గుమ్మడి గింజ‌లు, అర‌టి పండు, క‌మ‌లా పండు, టమోటాలు, బీన్స్ వంటి ఆహారాలు మానసిక స్థితి మెరుగుప‌రిచి.

చిరాకుని, ఒత్తిడిని దూరం చేస్తాయి.

తాజా వార్తలు