మనం పక్షులు ఎగరడం చూస్తూనే ఉంటాం.కొన్ని పక్షులు ఖండాలను సైతం దాటి వేరే దేశాలకు ప్రయాణిస్తూ ఉంటాయి.
ఆ పక్షులు ముందు నుండి అలా ఎగర గలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి.అయితే అన్ని పక్షులు ఇలానే ఎగుర లేవు.
కేవలం కొన్ని పక్షులకు మాత్రమే అంత దూరం ప్రయాణించే శక్తీ ఉంటుంది.మాములుగా మనకు కనిపించే పక్షులు అలా అంత దూరం ప్రయాణించే లేవు.
కానీ కొన్ని రకాల పక్షి జాతులు మాత్రం గాలిలో కొన్ని వేల కిలో మీటర్లు ప్రయాణం చేయగలవు.అయితే ఇప్పుడు గబ్బిలం కూడా 2 వేల కిలో మీటర్లు ప్రయాణించి రికార్డ్ సృష్టించింది.
ఇంత చిన్న గబ్బిలం అన్ని వేల కిలో మీటర్లు ప్రయాణించడంతో ఈ వార్త కాస్త వైరల్ అయ్యింది.గబ్బిలాలు కేవలం మన బొటన వేలు సైజులోనే ఉంటాయి.అవి 8 గ్రాములు మాత్రమే బరువు కలిగి ఉంటాయి.
అంత చిన్న గబ్బిలం లండన్ నుండి రష్యా వరకు 2 వేల కిలో మీటర్లు ప్రయాణించి సంచలనం సృష్టించింది.

అన్ని కిలో మీటర్లు ప్రయాణించడంతో ఒలంపిక్ టైటిల్ కూడా గెలుచుకుంది.కానీ చివరకు అది చనిపోయింది.2016 లో బ్రియాన్ రింగ్స్ అనే వ్యక్తి ఒక గబ్బిలం పై ఒక మార్క్ వేసాడు.ఆ మార్క్ వేసిన తర్వాత అది చాలా దూరం ప్రయాణించింది.
ఇంత చిన్న గబ్బిలం 2 వేల కిలో మీటర్లు ప్రయాణించడం ఇజంగా నమ్మలేని విషయమే.

అది మెగా గబ్బిలాలు నెలకొల్పిన రికార్డ్ బ్రేక్ చేసింది.సైటిస్టులు కూడా ఈ విషయాన్నీ తెలుసుకుని ఆశ్చర్య పోయారు.ఇది నాథుసియస్ పిపిస్ట్రెల్ జాతికి చెందినది అట.ఇది మాములు గబ్బిలాల కన్నా వేగవంతంగా ఎగురగలడు.అయితే ఈ గబ్బిలం లండన్ నుండి రష్యాకు ప్రయాణించి చివరకు అది పిల్లి చేతిలో ఒక చిన్న గ్రామంలో మరణించింది.
కానీ ఈ గబ్బిలం చనిపోయే ముందు రికార్డ్ సృష్టించింది.