వైరల్ వీడియో: ఓ మహిళ రైలు సీటు కోసం ఏకంగా..?!

సాధారణంగా రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం.దూర ప్రయాణాలకు బస్సుల్లో కంటే రైళ్లలో ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటారు.

 Viral Video: A Woman Unites For A Train Seat , Women Train, Seat ,viral, Viral N-TeluguStop.com

అయితే ఈ మధ్య కరోనా కారణంగా చాలా రైళ్లు పట్టాలెక్కడం ఆపేశాయి.కరోనా కారణంగా చాలా మంది ప్రయాణాలను తగ్గించుకున్నారు.

చాలామంది రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలను వదిలారు.అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటం వలన రైళ్లు యథాతధంగా పట్టాలెక్కుతున్నాయి.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రైలు ఎక్కేందుకు ఓ మహిళ పడరాని పాట్లు పడింది.

రైలులోకి వెళ్లడానికి ఓ మహిళ కిటికీలోంచి లోపలికి వెళ్లిపోయింది.సాధారణంగా రైలు ఎక్కడానికి కొంతమంది అందర్నీ తోసుకుంటూ ఎక్కి లోపలికి వెళ్లిపోతారు.

ఆ సమయంలో వాళ్లు సీటును సంపాదించాక ఎంతో గొప్ప ఘనకార్యం చేసినట్లు భావిస్తారు.ఆనందంతో పొంగిపోతారు.

ఉత్సాహంగా ఉల్లాసంగా చిందులేస్తారు.యువత అయితే ప్రయాణాలలో సీటు సంపాదించడం కోసం బస్సులు, రైళ్ల కిటీకిలోంచి ఎక్కడం మనం చూస్తూనే ఉంటాం.

ఇక్కడ కూడా ఓ మహిళ రైలు కిటికీ ద్వారా లోపలికి ఎక్కింది.రైలు బోగికి ఉండే ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి రైల్లోకి వెళ్లిపోయింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రైళ్లలో ఎమర్జెన్సీ భోగిని కచ్చితంగా ఉంటుంది.

ఆ విండోను కొన్ని అత్యవసర టైమ్స్ లోనే వినియోగించాల్సి ఉంటుంది.అలాంటి ఎమర్జెన్సీ విండో నుంచి ఓ మహిళ రైలు లోపలికి వెళ్లి సీటును పొందింది.

మహిళా అలా రైలు లోపలికి వెళ్లడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.నెట్టింట ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కైపోతున్నారు.

దీనిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.మహిళలు ఇలా కూడా రైలు కిటికిలోంచి లోపలికి వెళ్తారా అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube