క్రికెట్ దిగ్గజం క్రికెట్ కి ఎన్నో సేవలందించిన ధీరుడు సచిన్ టెండుల్కర్.భారత్ క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండుల్కర్ ను దేవుడు లా పూజిస్తారు.
సచిన్ టెండుల్కర్ ఎప్పటికప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.తాజాగా అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
జీవితంలో ఫెయిల్ అయ్యే వారి కంటే సక్సెస్ ఉన్న వారినే సమాజం ఎక్కువగా ఇష్టపడుతుంది అనేది జగమెరిగిన సత్యం.అసలు విషయానికి వస్తే సచిన్ షేర్ చేసిన వీడియోలో లో హర్షత్ గోతంకర్ అనే వ్యక్తికి రెండు చేతులు ఉండవు.
కానీ మనోధైర్యంతో ఆయన కాళ్ళతో క్యారమ్స్ ఆడుతూ అబ్బురపరిచాడు.అది కూడా మామూలు సాగా గేమ్ కాదండి బాబు… క్యారం బోర్డ్ లో ఉన్న అన్ని కాయిన్స్ గురు తప్పకుండా వేస్తాడు.
అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి మధ్య వ్యత్యాసం నిర్ణయంలా ఉంటుంది.ఆ విషయాన్నిహర్షత్ గోతంకర్ చేయగలను అని చేసి చూపిస్తున్నాడు. అతని ప్రేరణను ప్రేమిద్దాం… ఆ సంకల్పం నుంచి మనమందరం ఏం చేయొచ్చు నేర్చుకుందాం అంటూ సచిన్ టెండూల్కర్ కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సూపర్ ప్రతిభ మాత్రమే అద్భుతాలు సృష్టించిదని, విజయం సాధించాలంటే నిరంతర సాధన, కృషి ఉండాలి తనని తానే ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలంటూ ప్రశంసల జల్లు కురిపించాడు, మరి కొందరు ఈది జీవితానికి ఓ పేరున ఇదే నా వందనం అంటూ కామెంట్ చేశారు.