ప్రస్తుతం సోషల్ మీడియా అనేది విస్తృతం అయిన తర్వాత ఎన్నో రకాల ట్రెండ్స్ అనేవి వచ్చాయి.అందులో ఫ్రాంక్ వీడియోలు కూడా ఒకటనే చెప్పాలి.
కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ ఎంతబాగా యూ ట్యూబ్లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే సాధారణం ఒక కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్లి అనేక రకాలుగా ఆమెను ఆట పట్టించాలంటే మామూలు విషయం కాదు.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఫ్రాంక్ వీడియోనే ఒకటి నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.ఎందుకంటే ఆ వీడియో చేసింది ఒక భార్య తన భర్తపై.
దీంతో ఇప్పుడు ఈ ఫన్నీ వీడియోకు తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
ఇక ఇక్కడ మరో విషయం ఏంటంటే భార్యాభర్తలన్నాక ఎన్నో రకాల చిలిపి పనులు లేదా కొంటె పనులు అనేవి కామన్ అనే చెప్పాలి.
ఒకప్పుడు రహస్యంగా ఉండే వీరి చిలిపి పనులు కాస్తా సోషల్ మీడియా వచ్చాక విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పడు కూడా అలాంటి కపుల్స్ సేమ్ టామ్ అండ్ జెర్రీల్లగా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.
చాలా హాస్యంగా ఉన్న ఈ వీడియోలకు నెటిజన్లు కూడా ఎంతో ఫిదా అవుతున్నారనే చెప్పాలి.ఎందుకంటే ఈ వీడియోను చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరేమో.
ఇక అసలు విసయానికి వస్తే ఈ వీడియోలో నిద్ర పోతున్న భార్య నిద్రపోతుంటుంది.ఇక దీన్ని ఆసరాగా చేసుకుని ఆ సమయంలో ఆమె భర్త మెల్లిగా ఆమె జుట్టును విడదీసి చింపిరి చింపిరిగా చేసి ఐదు బెలూన్లను ఆమె జుట్టుకు జత చేయడం మనం ఇందులో చూడొచ్చు.
అయితే ఆమె నిద్ర లేచే సరికి ఆమెకు కాఫీ తెచ్చి లేపుతాడు, ఆమె కూడా లేవగానే తన జుట్టు మొత్తం పైకి లేస్తుంది ఈ వీడియోలో.ఇక ఆమె కాఫీ తాగడం పూర్తియిన తర్వాత ఆమె చిలిపి భర్త విషయం చెప్పగా ఆమె షాక్ అవ్వడం చూస్తే నిజంగానే నవ్వకుండా ఉండలేరేమో.