ఏపీలో ఆలయాల యాత్ర రేపటి నుంచి చేపట్టబోతున్నట్టు బిజెపి ప్రకటించింది.కొద్దిరోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పార్టీ అధిష్టానం క్లాస్ పీకడం తో పాటు, ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేసి పార్టీని బలోపేతం చేయాలనే విషయంపైనా ఆయనకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు వైసీపీ విషయంలో కాస్తో కూస్తో మొహమాటాలు ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి నిరంతరం ఏదో ఒక అంశం పై పోరాటం చేయాలని గట్టిగానే క్లాస్ ఇవ్వడంతో పాటు, కొన్నికొన్ని వ్యవహారాల పైన చర్చించారు.దీనిలో భాగంగానే 24వ తేదీ నుంచి ఏపీ లోని ప్రధాన ఆలయాలను సందర్శించాలి అని నిర్ణయించుకున్నారు.

ఈ యాత్రలో వీర్రాజు తో పాటు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ , మరి కొంత మంది పార్టీ నాయకుల ఆధ్వర్యంలో యాత్రను చేపట్టబోతున్నారు.దీనిలో భాగంగా ముందుగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.అయితే పైకి ఆలయాల యాత్ర గానే బిజెపి చెబుతున్న, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో చాలా ఆలయాల పై దాడులు జరిగి ధ్వంసం అయ్యాయి.వాటిపైన అప్పట్లో బీజేపీ ఆందోళన చేసినా, ఆ వ్యవహారం పెద్ద మైలేజ్ రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆలయాల యాత్రను చేపట్టి దశలవారీగా వైసిపి పై విమర్శలు చేయాలని చూస్తున్నారు.
అయితే దాడి జరిగిన ఆలయాల సందర్శన పైకి ప్రకటిస్తే ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉండడంతో, సాధారణ యాత్ర గానే దీనిని చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారట.వాస్తవంగా ఏపీలో ఆలయాలను ధ్వంసం ఘటనలో వరుసగా చోటు చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున జన జాగృతి సభలు నిర్వహించాలని చూశారు.
కానీ ఆ సమయంలో పంచాయతీ ఎన్నికలు ,ఆ తర్వాత మున్సిపల్, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు వరుసగా రావడంతో పాటు, కరోనా ప్రభావం తదితర కారణాలతో ఆ యాత్ర వాయిదా పడింది అయితే ఇప్పుడు వైసిపి కేంద్రం విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ బిజెపిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఏపీ లో జరిగే ఈ యాత్రకు తీసుకు మైలేజ్ తీసుకు వచ్చేందుకు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు యాత్ర పూర్తయ్యేనాటికి ఒక్కొక్కరుగా హాజరు కాబోతున్నట్లు సమాచారం.అయితే ఈ యాత్రకు తమ మిత్రపక్షమైన జనసేన ను కలుపుకు వెళ్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.