ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన రసబసగా మారింది.“ఇదేం కర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో రెండో రోజు చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు.అనపర్తిలో ఆయన పర్యటించాల్సి ఉండగా స్థానిక దేవి చౌక్ సెంటర్ వద్ద అడ్డుపడటం తో పాటు భారీ కేడ్లు అడ్డుపెట్టడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో తన పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.నిన్న అనుమతి ఇచ్చి ఇవ్వాల మళ్లీ ఎలా రద్దు చేస్తారు అని ప్రశ్నించారు.ఈ క్రమంలో ఎంతమంది పై పోలీసులు కేసులు పెడతారో మేము చూస్తాం.మా కార్యకర్తలు ముందుకొస్తే పోలీస్ స్టేషన్ లు పట్టవు.దీంతో చంద్రబాబు కాన్వాయ్ నీ అనపర్తి పట్టణంలోకి వెళ్లకుండా ఉన్నతాధికారులు మరియు పోలీస్ కానిస్టేబుల్ లు రోడ్డుపై బైఠాయించడం జరిగింది.చంద్రబాబు కాన్వాయ్ ముందుకెళ్లకుండా కట్టిడి చేయడంతో వెంటనే చంద్రబాబు.
పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసి.రౌడీ రాజ్యం అంతం చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది… అంటూ వాహనం దిగి కాలినడకన అనపర్తికి బయలుదేరడం జరిగింది.