శోక సంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆ చిన్నారి మృతి చెందడంతో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలలోనైనా ఇతరులకు చెడు జరగకూడదని కోరుకునే మంచి మనుషులలో ఒకరనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.

 Sad Incident Happened For Pawan Kalyan Fans Details Here Goes Viral , Pawan Kaly-TeluguStop.com

అయితే తాజాగా జరిగిన ఘటన వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.పవన్ కళ్యాణ్ ఆదుకున్న చిన్నారి మృతి చెందడంతో ఫ్యాన్స్ ఈ విధంగా చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం అరుదైన వ్యాధితో బాధ పడుతున్న రేవతి అనే చిన్నారి పవన్ ను చూడాలని కోరగా అభిమానులు ఎంతో కష్టపడి పవన్ కు ఆ విషయాన్ని తెలియజేశారు.ఆ చిన్నారిని పవన్ కలవడంతో పాటు ఒడిలో కూర్చుని మాట్లాడారు.

ఆ చిన్నారి పాడిన పాటకు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు.ఆ పాప పవన్ కాళ్లకు దండం పెట్టాలని ప్రయత్నించగా పవన్ మాత్రం వద్దని సూచనలు చేశారు.

Telugu Mysore, Pawan Kalyan, Revathi, Tollywood-Movie

చిన్నారికి ఆర్థికంగా కూడా పవన్ తన వంతు సహాయం చేశారు.అయితే ఆ చిన్నారి మృతి చెందిందనే వార్త అభిమానులకు బాధను మిగిల్చింది.ప్రస్తుతం ఈ చిన్నారి మైసూర్ లో చికిత్స పొందుతోందని అక్కడే మృతి చెందిందని సమాచారం.ఈ విషయం తెలిసి పవన్ సైతం భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.పాప ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Mysore, Pawan Kalyan, Revathi, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ మంచి మనస్సుతో ఎంతోమందిని ఆదుకుంటున్నారు.ఆయన చేసిన సహాయాల విలువ వెలుగులోకి రావడం లేదు.పార్టీలతో, కులాలతో సంబంధం లేకుండా తను సంపాదించిన డబ్బును పవన్ ఖర్చు చేస్తున్నారు.

పవన్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో బిజీగా బిజీగా ఉన్నారు.

సినిమా సినిమాకు పవన్ మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube