శోక సంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆ చిన్నారి మృతి చెందడంతో?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలలోనైనా ఇతరులకు చెడు జరగకూడదని కోరుకునే మంచి మనుషులలో ఒకరనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.
అయితే తాజాగా జరిగిన ఘటన వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.
పవన్ కళ్యాణ్ ఆదుకున్న చిన్నారి మృతి చెందడంతో ఫ్యాన్స్ ఈ విధంగా చేశారు.
నాలుగు సంవత్సరాల క్రితం అరుదైన వ్యాధితో బాధ పడుతున్న రేవతి అనే చిన్నారి పవన్ ను చూడాలని కోరగా అభిమానులు ఎంతో కష్టపడి పవన్ కు ఆ విషయాన్ని తెలియజేశారు.
ఆ చిన్నారిని పవన్ కలవడంతో పాటు ఒడిలో కూర్చుని మాట్లాడారు.ఆ చిన్నారి పాడిన పాటకు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు.
ఆ పాప పవన్ కాళ్లకు దండం పెట్టాలని ప్రయత్నించగా పవన్ మాత్రం వద్దని సూచనలు చేశారు.
"""/"/
ఆ చిన్నారికి ఆర్థికంగా కూడా పవన్ తన వంతు సహాయం చేశారు.
అయితే ఆ చిన్నారి మృతి చెందిందనే వార్త అభిమానులకు బాధను మిగిల్చింది.ప్రస్తుతం ఈ చిన్నారి మైసూర్ లో చికిత్స పొందుతోందని అక్కడే మృతి చెందిందని సమాచారం.
ఈ విషయం తెలిసి పవన్ సైతం భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.పాప ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
"""/"/
పవన్ కళ్యాణ్ మంచి మనస్సుతో ఎంతోమందిని ఆదుకుంటున్నారు.ఆయన చేసిన సహాయాల విలువ వెలుగులోకి రావడం లేదు.
పార్టీలతో, కులాలతో సంబంధం లేకుండా తను సంపాదించిన డబ్బును పవన్ ఖర్చు చేస్తున్నారు.
పవన్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో బిజీగా బిజీగా ఉన్నారు.
సినిమా సినిమాకు పవన్ మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.
రంగంలోకి రాబిన్ శర్మ .. కీలక బాధ్యతలు ఇచ్చిన బాబు