సినీ విశ్లేషకుడిగా, నటుడిగా, దర్శకుడిగా కత్తి మహేష్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ నిన్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.
కత్తి మహేష్ కు బాల్యం నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి.చిత్తూరు జిల్లాలోని పీలేరు కత్తి మహేష్ స్వస్థలం.
కత్తి మహేష్ తండ్రి వ్యవసాయ శాఖ అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు.
ఏదైనా సినిమా బాలేదని, ఫ్లాప్ అయిందని చెబితే కత్తి మహేష్ ఆ సినిమా ఎందుకు బాలేదో తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.
మైసూరులో డిగ్రీ పూర్తి చేసిన కత్తి మహేష్ హైదరాబాద్ లో మాస్ కమ్యూనికేషన్ చదివారు.కత్తి మహేష్ రాఘవేంద్ర మహత్యం అనే సీరియల్ కు పది రోజుల పాటు పని చేయడం గమనార్హం.
కత్తి మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకోగా ఆమె భార్య బెంగాళీ.
ఒక వర్క్ షాప్ లో కత్తి మహేష్ కు, అతని భార్యకు పరిచయం ఏర్పడింది.ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు.సినీ క్రిటిక్ కావడంతో కత్తి మహేష్ కు బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కింది.
బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు ఉన్న కత్తి మహేష్ ఆ షోలో జూనియర్ ఎన్టీఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.కత్తి మహేష్ కు సాయి రాజేష్ స్నేహితుడు కాగా అతని వల్ల కత్తి మహేష్ కు హృదయ కాలేయం సినిమాలో అవకాశం దక్కింది.
నటుడిగా మంచి గుర్తింపు వస్తే కెరీర్ ను కొనసాగించడంలో తనకు అభ్యంతరం లేదని కత్తి మహేష్ చెప్పినట్టు సమాచారం.కొబ్బరి మట్ట సినిమాలో కత్తి మహేష్ నగర బహిష్కరణ సీన్ లో కనిపించిన సంగతి తెలిసిందే.ఆ సీన్ షూటింగ్ సమయంలో కత్తి మహేష్ నిజంగానే నగర బహిష్కరణలో ఉన్నారు.