టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వరుసగా ఫిమేల్ సెంట్రిక్ కథలతో దూసుకుపోతున్న అందాల భామ తాప్సి.ఈ అమ్మడు ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన హవాని కొనసాగిస్తుంది.
ఫిమేల్ సెంట్రిక్ కథతో సినిమా అంటే దర్శక, నిర్మాతలు తాప్సి దగ్గరకి వెళ్తూ ఉండటం విశేషం.ప్రస్తుతం ఆమె నటించిన హసీనా దిల్ రుబా ఒటీటీలో రిలీజ్ అయ్యింది.
ఇక రష్మి రాకెట్, తో పాటు మరో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.మిథాలీ రాజ్ బయోపిక్ షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే మరో కొత్త సినిమాకి కూడా రీసెంట్ గా సైన్ చేసింది. మరో వైపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో తాప్సి కనిపించబోతుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్వరూప్ రెండో సినిమాగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గానే ఈ మూవీ కథాంశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో తాప్సి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.తాజాగా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా అందులో తాప్సి కూడా పాల్గొంది.
దీనికి సంబందించిన ఫోటోలని తాప్సి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.మోనిటర్ దగ్గర కూర్చొని అవుట్ పుట్ ని ఆమె పరిశీలుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే దీనిపై నెటిజన్లు ఎవరికీ తోచినట్లు వారు స్పందిస్తున్నారు.తెలుగు సినిమాపై గతంలో తాప్సి చేసిన విమర్శలని గుర్తుచేస్తున్నారు.