తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిగా తెలుగుతో పోలిస్తే ఇతర భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఐశ్వర్య నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం కెరీర్ కు మైనస్ గా మారింది.
తాజాగా ఈ బ్యూటీ నమ్మిన వ్యక్తే తనను మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక వ్యక్తిపై తాను చాలా నమ్మకం పెట్టుకున్నానని అతడు తనను డబ్బు కోసం వంచించాడని ఆమె చెప్పారు.
డబ్బుల కోసం తనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. తన సీక్రెట్లను ఆ వ్యక్తి లీక్ చేశారని ఆ విషయం తెలిసి తాను షాకయ్యానని ఆమె అన్నారు.
తనతో పాటే ఉన్న ఆ వ్యక్తి తన గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు.చాలామంది అ వ్యక్తిపై పోలీస్ కేసు పెట్టాలని సూచించారని కాను తాను కేసు పెట్టాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఇకపై తాను ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉంటానని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.కొంతమంది ఇలాంటి వ్యక్తులు చేసే పనుల వల్ల తనకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని ఆమె కామెంట్లు చేశారు.తాను మళ్లీ నమ్మకద్రోహానికి గురి కావాలని అనుకోవడం లేదని ఇతరులను మళ్లీ నమ్మవద్దని అనుకుంటున్నానని ఆమె తెలిపారు.మనం జాగ్రత్తగా ఉంటే ఇతరులు మోసం చేసే అవకాశం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే ఐశ్వర్య రాజేష్ చెప్పిన వ్యక్తి ఎవరు.? ఆ వ్యక్తి ఐశ్వర్యకు సంబంధించిన ఏయే సీక్రెట్లను లీక్ చేశారు.? ఎంత డబ్బు తీసుకుని ఆ వివరాలను లీక్ చేశారు.? అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఐశ్వర్య రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.