సాధారణంగా ఒక భాషలో ఏదైనా మూవీ సక్సెస్ అయితే ఆ మూవీ ఇతర భాషల్లో డబ్బింగ్ అవ్వడం జరుగుతుంది.తెలుగులో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో స్ ఇతర భాషల సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి.
కొంతమంది హీరోలు ఇతర భాషల్లో మార్కెట్ ను పెంచుకోవాలని భావించి తమ సినిమాలను డబ్బింగ్ చేస్తున్నారు.డబ్బింగ్ వల్ల ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను చూసే అవకాశం కలుగుతోంది.
1930 సంవత్సరానికి ముందు రిలీజైన సినిమాలన్నీ మూకీ సినిమాలు కాగా 1931 తర్వాత మాత్రం మాటలతో ఉన్న సినిమాలు విడుదలయ్యాయి.1950 సంవత్సరం నుంచి ఇతర భాషల సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి.తెలుగులోకి అనువాదమైన తొలి సినిమా ఆహుతి.బాలీవుడ్ ఇండస్ట్రీలో 1946 సంవత్సరంలో రిలీజై సక్సెస్ సాధించిన నీరా ఔర్ నందా అనే సినిమా తెలుగులో డబ్ అయ్యి 1950 సంవత్సరం జూన్ నెల 22వ తేదీన విడుదలైంది.
ఈ మూవీ ద్వారానే మహాకవి శ్రీశ్రీ వెండితెరకు పరిచయం కావడం గమనార్హం.శ్రీశ్రీ తెలుగులో ఈ మూవీకి మాటలు, పాటలు రాసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.నవీనా ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది.తెలుగులో ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమా తరువాత మరికొన్ని సినిమాలు సైతం తెలుగులో విడుదలయ్యాయి.
ఆ తరువాత 1953 సంవత్సరంలో రోహిణి, ప్రేమలేఖలు సినిమాలు హిందీ నుంచి డబ్బింగ్ అయ్యి తెలుగులో విడుదలయ్యాయి.
ఆ తర్వాత సౌత్ ఇండియాలోని వేర్వేరు భాషలకు చెందిన సినిమాలు తెలుగులో విడుదలవుతుండగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం.
ఈ సినిమా ద్వారా శ్రీశ్రీకి నెలకు 300 రూపాయల వేతనంతో రోహిణి సంస్థలో పని చేసే అవకాశం దక్కింది.ఆ తర్వాత శ్రీశ్రీ పాటల రచయితగా, డబ్బింగ్ రచయితగా గుర్తింపును సంపాదించుకుని స్థిరపడ్డారు.