మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో మగదీర మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.
రామ్ చరణ్ కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ మూవీగా మగధీర నిలిచింది.ఒక్కసారిగా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది.
భారీ బడ్జెట్ తో ఫిక్షన్ కథాంశంతో పునర్జన్మల ప్రేమకథగా ఈ మూవీని రాజమౌళి ఆవిష్కరించారు.ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా జక్కన్న పేరు మార్మోగిపోతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం జక్కన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా మూవీని తెరకెక్కించడానికి రాజమౌళి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

భారీ కాన్వాస్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ మూవీని తెరకెక్కించాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య మళ్ళీ మగధీర టాపిక్ తెరపైకి వచ్చింది.మగధీరకి సీక్వెల్ చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది.ఇక దీనికి సంబంధించి విజయేంద్రప్రసాద్ ఒక స్టొరీలైన్ కూడా సిద్ధం చేసారని, జక్కన్న దానిని రామ్ చరణ్ కి వినిపించడం జరిగిందనే ప్రచారం జరుగుతుంది.
ఇక రామ్ చరణ్ కూడా మగధీర సీక్వెల్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడనే మాట వినిపిస్తుంది.మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే రాజమౌళి స్పందించే వరకు వేచి చూడాల్సిందే.