చలన చిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు తమ తోటి నటీనటులతో ప్రేమలో పడి అప్పటికి పెళ్లి మాత్రం వేరే వాళ్ళతో చేసుకున్న నటీనటులు ప్రేమికులు చాలామంది ఉన్నారు.మరికొందరైతే ప్రేమించిన వాళ్లని మర్చిపోలేక పెళ్లి బంధానికి దూరమైన నటీనటులు కూడా చాలామంది ఉన్నారు.
అయితే ఒకప్పుడు పలు ధారావాహికలు మరియు సినిమాల్లో హీరోయిన్ గా నటించే ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీనియర్ నటి “నీనా గుప్తా” కూడా తన ప్రేమించిన వ్యక్తి కోసం పెళ్లి బంధానికి పూర్తిగా దూరమైంది.కాగా ఇటీవల నటించిన నీనా గుప్తా తన జీవితగాధ ఆధారంగా “సచ్ కహూన్ తో” అనే పుస్తకాన్ని రచించి విడుదల చేసింది.
అయితే ఈ పుస్తకంలో తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి పొందుపరిచింది.
ఇందులో భాగంగా తాను గతంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి తెలిపిందే.
ఇందులో సౌత్ ఇండియాకి సంబంధించిన ఓ ప్రముఖ డైరెక్టర్ ఓ సినిమా అవకాశాల విషయంలో తనను కలిసేందుకు ముంబైలో ఉన్నటువంటి “హోటల్” కి పిలిచాడని దాంతో తాను కూడా ఆ విషయం గురించి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లానని తెలిపింది.

కానీ ఆ దర్శకుడు వివరాలు చెప్పే నెపంతో తనపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని అంతేకాకుండా తనతో పాటు ఈ రాత్రి ఉంటావా…? అని అడిగాడని దాంతో తాను విషయం అర్థం చేసుకొని చాకచక్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది.కానీ తనను లైంగికంగా వేధించిన ఆ డైరెక్టర్ పేరుని మాత్రం నటి నీనా గుప్తా తెలియజేయలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి మీనా గుప్తా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించినప్పటికీ తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది.

కాగా ఆ మధ్య ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ప్రేమలో ఒక బిడ్డ కి జన్మనిచ్చింది.అయితే నీనా గుప్తా కూతురు మసాబా గుప్తా కు కూడా మధు వర్మ అనే వ్యక్తిని 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.