కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని ఇండస్ట్రీలో నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.కరోనా వైరస్ నిబంధనలు, నియమాలతో రెస్టారెంట్లు అసలు ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా అయిపోయింది.
అయితే క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా మంది వీధుల్లోకి రావడం, రెస్టారెంట్స్ తిరిగి తెరుచుకుంటూ ఉన్నాయి.ఈ సమయంలో వారికి అందించే చిన్న సహాయమైన కానీ కొండంత ఆనందాన్ని కలుగ చేస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
అలా చిన్న చిన్న సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక్కసారిగా 400 రెట్లు టిప్ లభిస్తే ఇంకా వారికి ఆనందం అవధులు లేవనే చెప్పాలి.అలాంటి సంఘటన ఒకటి అమెరికాలోని ఒక రెస్టారెంట్లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.అమెరికాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్లు 40 డాలర్ల కాగా., ఇలా ఉండగా బిల్ తో పాటు ఏకంగా 16000 వేల డాలర్లను వారికీ టిప్ గా ఇవ్వడం వారికి ఒకవైపు ఆనందానికి గురి చేస్తుంటే, మరోవైపు ఆశ్చర్యానికి లోను చేస్తుంది.ముందుగా ఆ రెస్టారెంట్ సిబ్బంది అంత మోతాదులో టిప్ ఊహించుకోలేదు, బిల్లుతోపాటు క్రెడిట్ కార్డు తీసుకున్న స్టాఫర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
ఈ క్రమంలో కస్టమర్ దగ్గరికి వెళ్లి ఓ మై గాడ్, ఇది సీరియస్ గానా అడగగా., దానికి రెస్పాన్స్ ఇస్తూ అవును మీరు తీసుకోవాలి.మీరు చాలా కష్టపడుతున్నారు.అంటూ సమాధానం ఇచ్చారూ కస్టమర్.అలాగే కస్టమర్ ఏదో పొరపాటుగా ఇచ్చాడు ఏమో అనుకొని మేనేజర్ కూడా అడిగే సరికి కావాలని ఇచ్చినట్లు కస్టమర్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు.అంతేకాకుండా వారు పడ్డ శ్రమను కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం.
ఇక టిప్ ను ఆ షిఫ్ట్ లో వాళ్లే ఉన్న వారే కాకుండా ఉద్యోగులు అందరూ కూడా పంచుకుంటమని స్టాఫర్ తెలియజేశారు.