టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఒక షోలో ప్రదీప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖ అని పేర్కొన్నారు.
ప్రదీప్ చేసిన కామెంట్ వల్ల ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహానికి గురి కావడంతో పాటు ప్రదీప్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా ప్రదీప్ పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజా వివాదంపై స్పందించిన ప్రదీప్ వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పారు.ప్రదీప్ ఒక షోలో తాను రాష్ట్రం రాజధాని గురించి అడుగుతున్న సమయంలో తాను ఒక నగరం పేరు చెప్పి ఆ నగరం క్యాపిటల్ ఏమిటని ప్రశ్నించానని అవతలి వ్యక్తి తన ప్రశ్న తప్పని చెప్పకుండా మరో జవాబు చెప్పడంతో తమ సంభాషణ తప్పుదోవలో వెళ్లిందని ప్రదీప్ పేర్కొన్నారు.
ఇతరులకు తాను చెప్పిన సమాధానం మరో విధంగా అర్థం కావడంతో తనకు బాధ కలిగిందని ప్రదీప్ తెలిపారు.
ఆ విధంగా జరగడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే ఎవరైనా బాధపడి ఉంటే వాళ్లకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ప్రదీప్ అన్నారు.తాను ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని ప్రదీప్ చెప్పుకొచ్చారు.ఎవరినో హేళన చేయాలని బాధ పెట్టాలని తనకు ఎప్పుడూ ఉండదని ప్రదీప్ తెలిపారు.
తాను ఇతరులను బాధ పెట్టాలని అనుకునే పనులు ఎప్పుడూ చేయనని ప్రదీప్ పేర్కొన్నారు.
తనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని ప్రదీప్ తెలిపారు.ప్రదీప్ స్పందించడంతో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాల్సి ఉంది.ప్రదీప్ ఒకవైపు బుల్లితెర షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ ఏడాది రిలీజై కలెక్షన్లపరంగా అబవ్ యావరేజ్ గా నిలిఛిన సంగతి తెలిసిందే.