బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి అమాంతం పెరిగింది.టాలీవుడ్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ దక్కించుకుంటున్నాయి.
కనుక పలువురు బాలీవుడ్ కోలీవుడ్ హీరోలు సైతం ఇటీవల తెలుగు సినిమా ల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే ఉప్పెన సినిమా లో నటించాడు.
ఇంకా పలు సినిమా ల్లో కూడా ఆయన నటించే అవకాశం ఉందని అంటున్నారు.ఇదే సమయంలో ఆయన తో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా నటించేందుకు సిద్దం అయ్యాడు.
దిల్ రాజు బ్యానర్ లో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా పట్టాలు ఎక్కబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది.
ఈ సమయంలోనే మరో స్టార్ కూడా తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు సినిమా తర్వాత మరో స్టార్ హీరో సూర్య కూడా తెలుగు లో నటించబోతున్నాడు.ఈయన హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.
ఎట్టకేలకు మళ్లీ సూర్య తెలుగు సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి.యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా రాబోతుందట.
అఖండ సినిమా ను చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు.ఆ తర్వాత సూర్య సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తమిళ హీరో కార్తి ఇప్పటికే ఊపిరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆయన అన్న సూర్య వచ్చే ఏడాది తెలుగు సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.