ఈ లోకంలో స్వార్ధం లేని మనిషంటూ ఎవరు ఉండరు.ముఖ్యంగా రాజకీయాల్లో నిస్వార్ధపరులను చూడాలంటే దుర్భిని పట్టుకుని వెతకవలసిందే.
లేదా అక్షరాల రూపంలో చదవవలసిందే కానీ కళ్లతో చూసే రోజులు ముత్తాతల కాలంలోనే పోయాయి.
ఇకపోతే నేటి రాజకీయాలు పూర్తిగా స్వార్ధంతో నిండుకున్నవే.
ఎవరైనా ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెబితే అది పూర్తిగా అబద్ధం.ఈ విషయం అతని మనస్సాక్షికి కూడా తెలుసు.
ఇకపోతే తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో దోపిడీ, అరాచక పాలన సాగుతుందని, ఆదాయం కోసం నిన్న సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి భూములను అమ్మకానికి పెట్టాలని చూడటం ఏంటని మండిపడ్డాడు.కాగా రాష్ట్ర ఎకానమీ పెంపుపై నిపుణులతో చర్చించాలి గానీ చెప్పినట్లుగా తలలాడించే బసవన్నలతో కాదని నిప్పులు చెరిగారు.
కాగా ఈ వ్యవహారం చాటున పెద్ద స్కామ్ జరుగుతుందని ఆరోపించారు.